Agripedia

కంది పంట సాగులో వచ్చే వివిధ రకాల తెగుళ్లు, నివారణ చర్యలు

KJ Staff
KJ Staff

పప్పుధాన్యాలకు మార్కెట్ లో ఎల్లప్పుడు అధిక డిమాండ్ ఉంటుంది. అందుకే రైతులు సైతం ఈ రకం పంటలను పండించి మంచి ఆదాయం పొందుతున్నారు. అలాంటి పంటల్లో కందులు కూడా ఒకటి. కందిపంటల సాగుతో వ్యవసాయదారులకు మంచి దిగుబడి, ఆదాయం రావాలంటే కందిలో సస్యరక్షణ చర్యలు చాలా కీలకం. మరీ ముఖ్యంగా కందిలో వచ్చే వివిధ రకాల తెగుళ్ల ప్రభావం పంటపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కంది పంట సాగులో వచ్చే వివిధ రకాల తెగుళ్లు, వాటి నివారణకు సంబంధించి వ్యవసాయ నిపుణులు వెల్లడించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కందిసాగులో సాధారణంగా వచ్చే తెగుళ్లలో ఎండు తెగులు ఒకటి. ఈ తెలుగు కారణంగా మొక్కలు కొంత భాగం ఎండిపోవడం గానీ, పూర్తి మొక్క ఎండి.. చనిపోవడం జరుగుతుంది. ఇది అన్ని దశల్లోనూ సంక్రమిస్తుంది. దీనిని నిర్ధారించుకోవాడానికి కొద్ది భాగం లేదా పూర్తిగా ఎండిపోయిన మొక్కలను పీకి పరిశీలించాలి. మొక్క కాండం చీల్చితే అందులో గోధుమ వర్ణపు చారలు కనిపిస్తాయి. పంట మొత్తంగా వ్యాపించకుండి జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు అధికంగా నిల్వ ఉండటం కూడా ఈ తెగులుకు కారణం అవుతుంది. దీనిని గుర్తిస్తే వ్యవసాయ నిపుణుల సలహాలు తప్పని సరిగా తీసుకుని సస్యరక్షణ చేపట్టాలి. పంట మార్పిడీలు చేయడం వల్ల కూడా ఈ తెగులు రాకుండా ఉంటుంది. కందిసాగులో వచ్చే మరో తెగులు స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఒకటి. వైరస్ వల్ల ఈ తెగులు సంక్రమిస్తుంది. నల్లి పురుగులు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు కారణంగా మొక్కలు ఆకులు లేత ఆకు పచ్చ రంగులోకి మారుతాయి. రాలిపోతాయి కూడాను. పూత, కాత రాకుండా ఉంటుంది.

కందిలో స్టెరిలిటీ మొజాయిక్ తెగులు నివారణ కోసం నాలుగు మిల్లీ లీటర్ల డికోఫాల్ ను లీటరు నీటికి కలిపి పిచుకారీ చేసుకోవాలి. వారానికి ఒకసారి రెండు సార్లు పిచుకారీ చేసుకోవాలి. ఈ తెగులును తట్టుకునే విత్తన రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సాగు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంది సాగు చేసే ప్రాంతాల్లో అధికంగా వర్షపాతం, నీరు నిల్వ ఉంటే కంది పంటకు ఫైటోఫ్లోరా ఆకు ఎండు తెగులు సోకుతుంది. ఆకులు, కొమ్మలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మరింత ముదిరి ఆకులు రాలటం, కొమ్మలు విరడగం జరుగుతుంది. దీని నివారణకు మూడు గ్రాముల మాంటజెబ్ ను లీటరు నీటితో కలిపి పిచుకారీ చేయాలి.

Share your comments

Subscribe Magazine