Agripedia

కంది పంట యాజమాన్య పద్ధతులు- కాయ తొలుచుపురుగు నివారణ చర్యలు

KJ Staff
KJ Staff
Pigeon Pea Farming
Pigeon Pea Farming

పప్పుదినుసులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ డిమాండ్ అధికంగా ఉటుంది. వాటిల్లో కందుకు ఒకటి. కందులను దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటా  రైతులు అధిక మొత్తంగా సాగు చేస్తున్నారు.  అయితే, కందిలో వచ్చే పలు రకాల తెగుళ్లు, చీడపీడలు ఆశించడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. దీంతో రైతు ఆదాయం కూడా తగ్గుతుంది. అయితే, కందిపంటల్లో వచ్చే వివిధ రకాల తెగుళ్లు రాకుండా తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు, నివారణ, యాజమాన్య పద్దతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం..

కందిపంటలో ప్రధానంగా వచ్చే సమస్య.. కాయతొలిచే పురుగు పంటను ఆశించడం. కంది పంట మొగ్గదశ, పూత, కాయ దశల్లో కొయ తొలిచే పురుగులు పంటను ఆశిస్తాయి. అలాగే, వరుసగా వర్షం పడుతుండటం, చిరుజల్లులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు కందిపంటపై కాయతొలుచు పురుగు దాడి అధికంగా ఉంటుంది. కందిపంటపై కాయతొలుచు పురుగు ప్రభావం పడకుండా తీసుకునే జాగ్రత్తల్లో ముఖ్యమైంది చీడపీడలను తట్టుకునే కంది సాగు విత్తనం ఎంపిక చేసుకోవడం.

అలాగే, విత్తనం నాటే ముందు పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. కలుపు లేకుండా, అధికవర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా ఏర్పటు చేసుకోవాలి. పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం చుట్టూ పెంచడం వల్ల పంటపై చీడపీడల ప్రభావం తగ్గుతుంది. పంటను చీడపీడలు ఆశిస్తున్నాయనే గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకుంటే పంటపై ప్రభావం ఎక్కువ పడకుండా ఉంటుంది. కాయతొలుచు పురుగుల నివారణ కోసం లింగాకర్షక బుట్టలు అమర్చుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కాయతొలిచే పురుగు పంటను తొలిదశలో ఆశిస్తే.. ఎసిఫేట్ 1.5 గ్రాములు, మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీ లీటర్లు, ఇండాక్సాకార్చ్, క్వినాల్ ఫాన్ 2.0 మిల్లీ లీటర్లు పిచికారి చేసుకోవాలి. ఇవే కాకుండా కందిపంటలో వచ్చే కాయతొలుచు ప్రభావాన్ని తగ్గించడానికి మార్కెట్ లో అనేక రకాల రసాయన మందులు అందుబాటులో ఉన్నాయి.  వ్యవసాయ నిపుణల సలహా మేరకు వాటిని వాడుకోవాలి.  చీడపీడలు తొలిదశలోనే గుర్తిస్తే పంటపై అధిక ప్రభావాన్ని నివారించవచ్చు. కాబట్టి రైతులు ఈ విషయంలో పంటను గమనిస్తూ ఉండాలి.

Share your comments

Subscribe Magazine