Agripedia

రైతులకు సిరులు కురిపిస్తున్న పీప్లి.. ఒక్కసారి నాటితే చాలు!

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో రైతులు కేవలం సంప్రదాయ పంటలు పండించడానికి మాత్రమే కాకుండా విభిన్న పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు ఔషధ గుణాలు కలిగిన పంటలను సాగు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విధంగా ఔషధ గుణాలు కలిగిన పంటలను సాగు చేయడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాకుండా లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. ఈ విధమైనటువంటి ఔషధ మొక్కలలో పీప్లి మొక్కలు ఒకటి.

ఈ పీప్లి మొక్కలను పీపర్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలు పెరిగే వేర్లు, కాండం, కాయలు వంటి వివిధ రకాల భాగాలను వివిధ రకాల జబ్బులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ విధమైనటువంటి ఔషధ మొక్కలను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా, అస్సాంలోని చిరపుంజీ వరకు తమిళనాడులోని అన్నమలై కొండల కొండల పై సాగు చేస్తారు. ఈ పంటను సాగు చేయడానికి ఎర్రనేల, నీరు ఎంతో అవసరం.

ఈ విధమైనటువంటి ఔషధ మొక్కలు పొలంలో ఒక్కసారి నాటితే సుమారు 5 నుంచి 6 సంవత్సరాల వరకు దిగుబడినిస్తాయి.అందుకోసమే పొలాన్ని బాగా దుక్కి సరైన ఎరువులను చల్లుతూ పంటను కాపాడుకుంటే రైతులు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఈ మొక్కలు నాటిన 4 నుంచి6 నెలలో పువ్వులు పూయడం ప్రారంభిస్తాయి. మరో రెండు నెలల్లో అవి నల్లగా మారుతాయి. ఈ విధంగా మారిన బ్రోకెన్ పండ్లను మార్కెట్లో అమ్మడం వల్ల రైతులు అధిక లాభాలను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine