వ్యవసాయ రంగం అధిక దిగుబడి సాధించడం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తృతముగా కృషి చేస్తుంది దీనిలో భాగంగానే , 15 పంటలపై విస్తృత పరిశోధనలు చేపట్టిన PJTSAU శాస్త్రవేత్తలు అధిక దిగుబడి అందించే 61 విత్తన రకాలను అభివృద్ధి చేసారు అవి ఈపంటనునుంచి రైతులకు అందుబాతులో ఉండనున్నాయి .
వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) ప్రధానముగా వరి పంటలో 10 కొత్త విత్తన రకాలు , నువ్వులు ,జొన్న రకాలను ఇప్పటికే రైతుల కోసం అందుబాటులో ఉంచింది .
అభివృద్ధి చేసిన ఈ కొత్త విత్తన రకాలను శుక్రవారం ఇక్కడ PJTSAU వైస్ ఛాన్సలర్ మరియు వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖ APC & సెక్రటరీ, M రఘునందన్ రావు విడుదల చేశారు.
అదేవిధముగా PJTSAU, CGIAR-IRRI రైతుల కోసం ఉచితముగా 3 రోజుల పట్టు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు శాఖ APC & సెక్రటరీ, M రఘునందన్ రావు తెలిపారు .
ఈ సంవత్సరం, విశ్వవిద్యాలయం మూడు పంటలలో అభివృద్ధి చేసిన ఎనిమిది విత్తన రకాలు - వరిలో ఐదు, జొన్నలో రెండు మరియు నువ్వులలో ఒకటి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సాగు చేయడానికి సెంట్రల్ వెరైటీ విడుదల కమిటీ ద్వారా ఆమోదించబడింది మరియు విడుదల చేయబడింది. మరొకటి, మూడు పంటలలో ఏడు విత్తన రకాలు - వరిలో ఐదు, నల్ల శనగ మరియు నువ్వులలో ఒక్కొక్కటి రాష్ట్ర వెరైటీ విడుదల కమిటీ ద్వారా విడుదల చేయడానికి అంగీకరించబడింది.
Tandur Tur GI Tag : తాండూరు కంది పప్పుకు GI ట్యాగ్ .. తెలంగాణాలో GI ట్యాగ్ పొందిన ఉత్పత్తులు ఇవే!
అధిక దిగుబడి ,తెగుళ్లను, భూమి లవణీయతకు తట్టుకునే విధముగా ఈ రకాలను అభివృద్ధి చేసారు . దీనితో రైతులకు పెట్టుబడి ఖర్చులు కలిసివచ్చి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉన్నది . రాజేంద్రనగర్ వరి-3 ప్రసిద్ధ స్థానిక రకం చిట్టిముత్యాలు వంటి లక్షణాలనుఈ విత్తన రకాలు కల్గి వున్నాయి .
వివిధ పంటలపై విస్తృతంగా పరిశోధనలు చేపట్టిన వర్సిటీ గత ఏడేళ్లలో 15 రకాల పంటల్లో 61 విత్తన రకాలను అభివృద్ధి చేసి విడుదల చేసింది. ఈ విత్తన రకాల్లో 26 వరి పంటలో ఉన్నాయి.
Share your comments