Agripedia

కనకాంబరం సాగులో తీసుకోవలసిన.. సస్యరక్షణ చర్యలు!

KJ Staff
KJ Staff

ఆకర్షణీయ రంగుల్లో లభించే కనకాంబరం నీటిఎద్దడిని తట్టుకోనే బహువార్షిక పూల జాతి మొక్క. కనకాంబరం సాగులో మొక్కలు నాటిన అప్పటి నుంచి సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యల పాటించినట్లయితే దాదాపు మూడు సంవత్సరాల వరకు సంవత్సరానికి 1800 కిలోలు నుండి2500 కిలోల వరకు అధిక పూల దిగుబడిని పొందవచ్చు.కనకాంబరం సాగు చేయాలనుకున్న రైతులు ఎకరాకు 2 కిలోల నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని మే జూన్ నెలల్లో నారుమడిని పెంచుకుని ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రధాన పొలంలో 30 × 30 సెంటి మీటర్ల దూరంలో నాటు కున్నట్లయితే చీడపీడల ఉధృతి తగ్గి అధిక దిగుబడులు సాధించ వచ్చు.

సస్యరక్షణ చర్యలు:

ఎండుతెగులు : కనకాంబరం సాగులో ఎండు తెగులు ప్రధాన సమస్య.మొదట ఎండు తెగులును తట్టుకునే విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి.ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వాలిపోయి, ఆకుల అంచులు పసుపు రంగుకు మారి, కొమ్మల చివర్లు కిందకు వంగి కాండం కుళ్ళేటట్లు చేస్తుంది. దాంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. దీని నివారణకు ఎండు తెగులు ఆశించిన మొక్కల మొదళ్ళు తడిచేలా మ్యాంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కకు 20-25 మి.లీ. ద్రావణాన్ని పోయాలి.

నారుకుళ్ళు తెగులు: నారుమడి వేసినప్పుడు నీరు ఎక్కువగా నిలవ ఉండడం వలన గాని, నారుకుళ్ళు ఆశించే శిలీంద్రం ఉన్న నేలల్లో నారుమడి వేయడం వలన నారుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. తెగులు నివారణకు నారుమడిలో కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి చ మీ కు 2.5 లీ. చొప్పున నారుమడిని తడపాలి.

ఆకుమచ్చ తెగులు: ఆకులపై మొదట చిన్న, గుండ్రని పసుపు రంగు మచ్చలు ఏర్పడి తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలి పోతాయి. దీని నివారణకు ఆకులన్నీ తడిచేలా మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine