Agripedia

రైతులకు శుభవార్త.. రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు జమ.. ఎప్పుడంటే?

KJ Staff
KJ Staff

రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి, అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన". ఈ పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.అయితే ఈ డబ్బులను ఒకేసారి కాకుండా ఆర్థిక సంవత్సరంలో మూడు విడతల్లో ఒక్కోసారి 2000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా దాదాపు 12 కోట్లు మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా22 వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకుఈ పథకం ద్వారా 8 విడుతల్లో అంటే ఒక రైతుకు 16 వేల రూపాయలు పంపిణీ చేశారు. తాజాగా ఆగస్టు నెలలో 9వవిడత పీఎం కిసాన్ నగదును పంపిణి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులకు ప్రభుత్వం మరోసారి అవకాశాన్ని కల్పించింది. కొంత కాలంగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పని చేయలేదు.ఇప్పుడు ఈ ఆప్షన్ పని చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి రైతు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్ సైట్ లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా దగ్గర్లోని మీసేవా కేంద్రాలకు రైతు పూర్తి వివరాలతో కూడిన పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ను తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine