Agripedia

పాలీసల్ఫేట్ స్థిర వ్యవసాయానికి అవసరమైన ముఖ్యమైన సహజ ఎరువు

KJ Staff
KJ Staff
Polysulphate  ICL
Polysulphate ICL

యూకేకి చెందిన ఐసీఎల్ సంస్థ గనుల నుంచి తవ్వి తీస్తున్న సకల పోషకాలు కలిగిన సహజ ఎరువు పాలీసల్ఫేట్. ఇది సహజసి ద్ధమైన ఖనిజం (డైహైడ్రేట్ పాలిహెలైట్). ఇందులో పొటాషియం, సల్ఫర్, కాల్పిషయం, మెగ్నీషియం అనే నాలుగు ముఖ్యమైన పోషక పదార్థాలున్నాయి.

పాలీసల్ఫేట్ స్పటిక (క్రిస్టల్) రూపంలో ఉండటం వల్ల నీటిలో నెమ్మదిగా కరుగుతుంది. పోషక పదార్థాలను నేలలోకి ఒక క్రమపద్ధతిలో విడుదల చేస్తుంది. రైతులు ఏళ్లుగా వినియోగిస్తున్న సంప్రదాయ పొటాష్, సల్ఫేట్ ఎరువులు కేవలం కొంత కాలం వరకే ప్రభావం చూపుతాయి. అయితే పాలీ సల్ఫేట్ కు ఉన్న ప్రత్యేక గుణం కారణంగా పంట చేతికొచ్చే వరకు మొక్కలకు అవసరమైన అన్ని పోషకపదార్థాలు అందుతూ ఉంటాయి.

పాలీ సల్ఫేట్ (పాలీ హెలైట్) నెమ్మదిగా పోషకాలను విడుదల చేయడం వల్ల నేలలో ఏళ్ల తరబడి ఆ పోషకాలు నిలిచి ఉంటాయి. నీటి ప్రవాహంతో పోషకాలు కొట్టుకుపోవడం వల్ల కలిగే నష్టం కూడా తగ్గుతుంది. పాలీ సల్ఫేట్ కు ఉన్న ఈ ప్రత్యేకత కారణంగా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది అత్యుత్తమమైన ఎరువుగా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అన్ని రకాల పంటలకు అనువైన పాలీసల్ఫేట్

ఇది రైతులకు అతి తక్కువ ధరకే లభించే అత్యంత అనుకూలమైన, ప్రభావంతమైన ఎరువు. ఒకే సమయంలో ఒకే ఎరువు ద్వారా మొక్కలకు అవసరమైన నాలుగు రకాలైనా పోషకాలను అందిస్తుంది. పాలీ సల్ఫేట్ అన్ని రకాల నేలలు, పంటలకు అనువైనది. ఈ ఎరువు ద్వారా నిరంతరం అందే సల్ఫర్ మొక్కల్లో నత్రజని వినియోగ సామర్థ్యాన్ని (NUE) పెంచుతుంది. మొక్కల్లో ప్రోటీన్ నిర్మాణానికి సల్ఫర్, నత్రజని సమపాళ్లలో అందడం అత్యంత అవసరం. పాలీ సల్ఫేట్ లో క్లోరైడ్ (CI) అతి తక్కువ మోతాదులో ఉన్నందున క్లోరైడ్ ను తట్టుకోలేని పొగాకు, ద్రాక్ష, తేయాకు పంటలకు మేలు చేస్తుంది. బంగాళాదుంపలో తగుపాళ్లలో పొడితనం కొనసాగేలా సహాయపడుతుంది.

భూసారం పెంపు, పర్యావరణ అనుకూలం

పాలీ సల్ఫేట్ సాధారణ స్థాయి పీహెచ్  కలిగిన ఎరువు. అందుకే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూసారాన్ని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇతర ఎరువులను వివిధ కంపెనీలు రసాయన పద్దతుల్లో రూపొందిస్తుండగా.  ఐసీఎల్ (ICL) మాత్రం పాలీ సల్ఫేట్ ను సహజ రూపంలో అందిస్తోంది. యూకేలోని నార్త్ సీ (NORTH SEA) దిగువన ఉన్న క్లీవ్ ల్యాండ్ లోని గనుల్లో 1250 మీటర్ల  లోతు నుంచి పాలీ సల్ఫేట్ ను వెలికితీస్తున్నారు. అలా సేకరించిన పాలీ సల్ఫేట్ ను పొడిగా మార్చి, జల్లించి సంచుల్లో నింపి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. పాలీ సల్ఫేట్ తయారీలో ఎలాంటి రసాయనిక పద్ధతులు అనుసరించరు. ఇది సహజ ఎరువు అయినందున ఆర్గానిక్ సాగుకు కూడా పనికొస్తుంది. పాలీ సల్ఫేట్ ఉత్పత్తిలో వెలువడే కర్భన ఉద్గారాల శాతం చాలా తక్కువ. (ప్రతి కిలో ఉత్పాదనలో కేవలం 0.034 Kg CO2e) మాత్రమే వెలువడుతుంది. ఇతర ఎరువుల ఉత్పత్తితో పోలిస్తే ఇది చాలా తక్కువ అయినందున పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.

పాలీ సల్ఫేట్ కు ఇన్ని ప్రత్యేకలు ఉన్నందునే ప్రపంచవ్యాప్తంగా సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కొరతను నివారించేందుకు ఈ ఎరువును ఉపయోగించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.

మరిన్ని వివరాల కోసం www.fertilizers.sales@ICL-group.com కు మెయిల్ చేయండి లేదా 8860135010 నంబర్‌కు కాల్ తప్పిపోయింది. 

పాలీ సల్ఫేట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని www.polysulphate.com వెబ్ సైట్ లో చూడవచ్చు.

Share your comments

Subscribe Magazine