Agripedia

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కాపాడుకోండి ఇలా !

KJ Staff
KJ Staff
కల్లాల్లో తడిసి మొలకెత్తుతున్న  ధాన్యం
కల్లాల్లో తడిసి మొలకెత్తుతున్న ధాన్యం

వరి పంట సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో వరి కోతలు ముమ్మరమై కొనుగోలు కేంద్రాలు ధాన్యం తో పోతెత్తుతున్న సమయం లోనే అకాల వర్షాలు అడ్డు పడుతున్నాయి. కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్ధవ్వడం పొలాల్లోని వరి నేలవాలడం తో కర్శకులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ధాన్యం మొలకెత్తకుండా పలు విధాలా ప్రయత్నిస్తున్నారు. తడిసిన వడ్లు రంగు మారకుండా ఉప్పు ఉపకారిగా పని చేస్తుంది.

 

అకాల వర్షాలతో తడిసిన ధాన్యం పొలాల్లోని వరి కంకులు మొలకేత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది


కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యం తడిసి వస్తే అది మొలకెత్తకుండా లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున ఉప్పు కలిపి పిచికారి చేసుకోవాలి.అప్పుడు మొలకలు రాకుండా కపాడుకోగలుగుతాము. వీటిని విక్రయించుకోవడానికి ఎలాంటి ఆటంకం కలగదు.


పొలంలో 80 శాతం కోతకు సిద్దం గా వుండి అందులో వరి కోత యంత్రం వెళ్లేందుకు వీలుగా వుంటే వెంటనే మార్పిడి చేసి పారాబాయిల్డ్ మిల్లులకు విక్రయించుకోవాలి.


కోతకు సిద్దం గా ఉండి పొలంలోకి వరి కోత యంత్రం వెళ్ళలేని పరిస్థితులు ఉంటే వెంటనే లీటరు నీటికి 10 గ్రాముల ఉప్పు కలిపి పిచికారి చేయడం వల్ల వరి కంకుల్లోని ధాన్యం మొలకెత్తకుండా రంగు మారకుండా వుంటుంది.

ఈ పరిస్థితులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1.కుప్పలుగా పోసిన ధాన్యాన్ని పలుచగా నేలపై చల్లినట్లు ఆరబోయాలి. ఎప్పటికప్పుడు కలియ దిప్పడం తో పాటు గాలి అందేలా చూడాలి.
2.తడిసిన, రంగు మారిన గింజలను మంచి ధాన్యంతో కలపకూడదు. వేర్వేరుగా ఉంచితే ఎక్కువ నష్టం జరగదు.
3.తడవకుండా ఉండేందుకు కుప్పను ప్రత్యేక మైన పద్దతిలో కాపాడేలా టార్పలిన్లు కప్పాలి. వరద పక్క నుండి వెళ్ళేలా పాదులు చేయాలి.

Author 

జె. విజయ్
సేధ్య విభాగ శాస్త్రవేత్త
కృషి విజ్ఞాన కేంద్రం
జమ్మికుంట, కరీంనగర్

Share your comments

Subscribe Magazine