భారతదేశంలో మిరప పంటను ఒక ముఖ్యమైన కూరగాయ మరియు వాణిజ్య పంటగా సాగు చేయబడుతుంది. మిరపలో సాగు చేయబడే రెండు జాతులు క్యాప్సికమ్ అన్యూయమ్ మరియు క్యాప్సికమ్ ఫ్రూటీసెన్స్, కుటుంబం సోలనేసి. మిరపకాయ దాని యొక్క రంగు మరియు ఘాటైన రుచి కారణంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. 2021లో 7.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నుండి 19.14 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు హెక్టారుకు 2576 కిలోల ఉత్పాదకతతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మిర్చి వినియోగదారు మరియు ఎగుమతిదారుగా నిలిచింది. మిర్చి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో పండిస్తున్నారు.
నల్ల తామర లక్షణాలు :
- పువ్వుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు గట్టిపడిపోయి వంకరగటింకరగా తిరిగిపోతాయి.
ఆకర్షణీయమైన పువ్వుల మెరుపును తగ్గిస్తాయి.
ఈ పురుగు ఆశించిన పండ్లు వాటి ఆకృతిని కోల్పోయి కుశించుకుపోతాయి.
ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు గిడసబారిపోయి, ఆకులన్నీ రాలిపోతాయి.
ఆకులు, కాయల మీద రాగి మచ్చలు ఏర్పడతాయి.
నల్ల తామరను గుర్తించడం ఎలా ?
నల్ల తామరను కలగజేసే పురుగులు ఆడ మరియు మగ పురుగులు పరిమాణం మరియు రంగులో తేడా ఉంటాయి. ఆడ పురుగు సాధారణంగా 1 మి.మీ పొడవు, తల మరియు ప్రాగ్వక్షం గోధుమ రంగు, మధ్య మరియు అగ్ర వక్షం పసుపు గోధుమ రంగు, ఉదరం నలుపు రంగుతో ఉంటాయి. ముందు రెక్కలు ముదురు రంగులో ఉంటాయి, లేత రంగు ఆధారంతో ఉంటాయి. మూడవ స్పర్శస్పృంగం ఖండితం మరియు నాల్గవ, ఐదవ ఖండితాల మొదలు భాగం లేత రంగులో ఉంటాయి (పసుపు లేదా తెలుపు).
మగ పురుగులు పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఆకు ఉపరితలంలో మరియు పువ్వుల లోపల కనిపిస్తుంటాయి.
నల్ల తమర నివారణ చర్యలు
యాజమాన్య చర్యలు: ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతాలకు ఈ పురుగు వ్యాప్తిని తగ్గించడానికి నిర్ధిష్ట ప్రాంతాలలోని మొక్కలను పూర్తిగా నాశనం చేయాలి.
నిర్దిష్ట ప్రాంతాలలో పురుగు ఎక్కువ సోకిన మొక్కలను పూర్తిగా నాశనం చేయడం ద్వారా భారతదేశంలోని ఇతర మిరప పండించే ప్రాంతాలకు ఈ త్రిప్స్ మరింత వ్యాప్తి చెందకుండా నివారించడం ప్రధాన లక్ష్యం. ఎటువంటి పురుగులు కానీ, తెగులు కానీ సోకని నారు మొక్కలను మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలి. మిర్చి పండించే ప్రాంతాలలో సర్వేలు చేయడం, కొత్త ప్రాంతాలలో నిరంతర సమగ్ర పర్యవేక్షణ మరియు తనిఖీ చేయడం వలన త్రిప్స్ నియంత్రణలో ఉంచుతుంది. స్థానిక ప్రాంతాలు/విశ్వవిద్యాలయాలు/డిపార్ట్‌మెంట్లు సిఫార్సు చేసిన పంట సాగు విధానాలను (ప్యాకేజీ ఆఫ్ ప్రాక్టీసెస్) ప్రకారం రసాయనిక క్రిమిసంహారకాలను అలాగే ఎరువులను తెలివిగా ఉపయోగించడం. బ్లూ స్టిక్కీ ట్రాప్స్ (40-50 ట్రాప్స్ /ఎకరం) మరింత ప్రభావవంతంగా కనిపిస్తాయి.
డిసెంబర్ 28 నుంచి రైతుబంధు .. సంక్రాంతి లోపు రైతుల అకౌంట్ లో డబ్బులు
నివారణ /చికిత్స :
వేపనూనె 50000 ppm-1lit/ఎకరానికి ఉపయోగించడం వలన గుడ్లు పెట్టడాన్ని మరియు లార్వాల పెరుగుదలను నిరోధిస్తుంది. జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా - సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్-NBAIR PFDWD@20గ్రా./1లీ. లేదా బాసిల్లస్ ఆల్బస్-NBAIR-BATP@20గ్రా./1లీ. ముఖ్యంగా పూలు మరియు పండ్లపై పిచికారి చేయవలెను. పురుగు నష్ట పరిమితి మరియు తీవ్రత ఆధారంగా థయాక్లోప్రిడ్ 21.7% SC@ 2మీ.లి /లీ, డైనోట్‌ఫురాన్ 20% EC@ 0.4 గ్రా/లీ, సైంట్రానిలిప్రోల్ @ 2మీ.లి/1లీ, టోల్‌ఫెన్‌పైరాడ్ 15% EC@ 1.5-2 మీ.లి/లీ, స్పైన్‌టోరమ్ 1.10% SC@ 0.9 మీ.లి/1లీ మరియు ఫిప్రోనిల్ 5% SC @1.5-2 మీ.లి/లీ. వంటి కీటక నాశినులను మార్చి మార్చి పిచికారి చేయాలి.
Autors
1. యం.గోపి ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏంటమోలజి విభాగం, SKYCAS, ఎచ్చెర్ల &
2. ఎన్. లక్ష్మి గాయత్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏంటమోలజి విభాగం, SKYCAS, ఎచ్చెర్ల.
Share your comments