Agripedia

రేపటి నుంచి రైతుబంధు బ్యాంకు ఖాతాలో ..

Srikanth B
Srikanth B
Raithu Bandu 2022
Raithu Bandu 2022

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే రైతులకు అండగ నిలువడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడానికి పెట్టుబడి అనేది అత్యంత ముఖ్యమైనదని పేర్కొంటూ రైతుల కోసం పలు పథకాలను తీసుకువచ్చింది. అందులో ఒకటి రైతు బంధు పథకం. ఈ పథకం ద్వారా సాగు ప్రారంభ పెట్టుబడిని ప్రభుత్వం రైతులకు అందిస్తోంది.రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతులకు తాజాగా శుభవార్తను అందించింది.


యాసంగి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశిం చారు. రైతు బంధు నిధులను ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రా రంభించి సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ చేయనున్న ట్లు తెలిపారు. మొత్తం రూ.7,600 కోట్లను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ఈ మేరకు సర్కారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. . ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలంలో రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రట రీకి సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఫజల్ బీమా యోజన కింద రైతులకు 1.25 లక్షల కోట్లు పంపిణీ: కేంద్ర ప్రభుత్వం

ఈ సంవత్సరం రైతు బంధు పథక లబ్దిదారులు 63.25 లక్షల మంది ఉన్నట్లు ఇప్పటికే రైతు బందు కు అవసరమైన నిధులు రాష్ట్ర సర్కార్ కు సమకూరినట్లు సమాచారం.ఈ ఏడాది కొత్తగా 2.81 లక్షల మంది రైతులను రైతు బంధు పథకంలో చేర్చామని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి 7508.78 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు.

ప్రధాన మంత్రి ఫజల్ బీమా యోజన కింద రైతులకు 1.25 లక్షల కోట్లు పంపిణీ: కేంద్ర ప్రభుత్వం

Share your comments

Subscribe Magazine