Agripedia

ఇలా వ్యవసాయం చేస్తే లాభాలే లాభాలు!

KJ Staff
KJ Staff

సాధారణంగా మనం ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించి అధిక ఆదాయం పొందాలంటే తప్పనిసరిగా పాత పద్ధతులకు స్వస్తి పలికి నూతన ఆర్ధిక విధానాలను అనుసరించడం వల్ల ఏ రంగంలోనైనా అభివృద్ధిని సాధిస్తారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో కూడా పాత పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల రైతులకు అధిక పెట్టుబడులు పెట్టి, తక్కువ లాభం కలగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఈ క్రమంలోనే రైతులు సరికొత్త ఆలోచనా విధానాలను అనుసరించి ఐదంతస్తుల విధానంలో పంటను సాగు చేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. మరి ఈ ఐదు అంతస్తుల వ్యవసాయం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందగలిగే ఐదంతస్తుల విధానాన్ని అధికారులు కర్నూలు జిల్లాలో ప్రోత్సహించడం కోసం చర్యలు చేపడుతున్నారు. ఈ ఈ క్రమంలోనే ఐదు అంతస్తుల విధానంలో పంటను సాగు చేసే రైతులకు ప్రోత్సాహాన్ని అందించాలని గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే ఈ ఏడాది చర్యలను చేపట్టనుంది.

రెండు సంవత్సరాల క్రితమే పలు ప్రాంతాలలో రైతులు స్వచ్ఛందంగా ఈ ఐదంతస్తుల విధానంలో పంటను పండించారు. ఈ విధానంలో పంటలు పండించడం వల్ల ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయని పలువురు నిపుణులు సైతం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఐదంతస్థుల విధానంలో పంటను సాగు చేయడం వల్ల ఎక్కువగా నీటి అవసరం, అధిక మందుల వినియోగం ఉండదు. ఏడాది పొడుగునా రైతులు పంట దిగుబడులను పొందవచ్చు. ఈ క్రమంలోనే రైతులు ఈ సంవత్సరం పొడవునా ఈ ఐదంతస్థుల పంట విధానం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ ఐదు అంతస్తుల విధానంలో భాగంగా మొదటి అంతస్తులో 36 అడుగుల విస్తీర్ణంలో మామిడి చెట్లను నాటుకోవాలి. అదేవిధంగా రెండవ అంతస్తులో భాగంగా మోసంబి, అంజూర వంటి మొక్కలను నాటుకోవచ్చు. మూడవ అంతస్తులో భాగంగా అరటి, బొప్పాయి, జామ, మునగ వంటి పంటలను సాగు చేసుకోవచ్చు. ఇక నాలుగవ అంతస్తులో కూరగాయలు, చిరుధాన్యాలు ఆకుకూరలు వంటి పంటలను పండించుకోవచ్చు. ఇక ఐదవ అంతస్తులో భాగంగా తీగజాతి దుంప జాతి వంటి పండ్లను పండించుకోవచ్చు.అంతస్తుల విధానం ద్వారా సంవత్సరం మొత్తం మనము పంట దిగుబడిని పొందటమే కాకుండా తక్కువ పెట్టుబడి తో అధిక ఆదాయాలను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More