Agripedia

తక్కువ పెట్టుబడితో.. అధిక లాభాలనిచ్చే.. ఎర్ర బెండ!

KJ Staff
KJ Staff

సాధారణంగా మనం ఆకు పచ్చ రంగులో ఉన్నటువంటి బెండ సాగును చూసి ఉంటాము. ఈ విధమైనటువంటి బెండకాయలను తినడం వల్ల మనలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని భావించి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తినడానికి ఇష్టత చూపుతారు. అయితే కేవలం ఆకుపచ్చని బెండ మాత్రమే కాకుండా, ఎరుపు రంగు బెండ కూడా సాగులో ఉంది. ఈ ఎరుపు రంగు బెండకి మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం, వవరంగల్ , పెంబర్తికి చెందిన ప్రభాకర్​రెడ్డికి సేంద్రీయ వ్యవసాయం పై మక్కువ ఉండటం చేత సేంద్రియ పద్ధతులను అవలంబిస్తూ ఎర్ర బెండను సాగు చేస్తున్నారు. ఈ విధంగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన ఎర్ర బెండకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ బెండ సాగు చేయడానికి తక్కువ పెట్టుబడులు పెట్టిన మనకు అధిక లాభాలను తెచ్చిపెడుతుంది.

ఈ విధమైన ఎరుపురంగు బెండను సాగు చేయడం చాలా అరుదు అని, ఈ క్రమంలోనే ఈ బెండకు అధిక డిమాండ్ ఏర్పడిందని రైతు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఈ విధమైనటువంటి ఎరుపు రంగు బెండ వంగడాన్ని రాధిక అని పిలుస్తారని, తెలిపారు. ఈ బెండ సాగు చేయడానికి ఎక్కువగా చలి ఉండే ప్రాంతాలు ఎంతో అనుకూలం. ఇలాంటి ప్రాంతాలలో బెండ అధిక దిగుబడి వస్తుందని ఈ సందర్భంగా రైతు ప్రభాకర్ రెడ్డి తెలిపాడు. సాధారణ బెండతో పోలిస్తే ఈ బెండలో ఎక్కువ మొత్తంలో సూక్ష్మపోషకాలు ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఎర్ర బెండ ఎంతో మంచిదని చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine