ప్రస్తుతం భారతదేశంలోనూ, చైనాలో అధిక వర్షపాతం నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉండగా..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడ ప్రజలు తీవ్ర వేడి కారణంగా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. యూఏఈవర్షాలు కురవక పలుప్రాంతాలలో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి అక్కడ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేశారు.
దేశంలో వర్షం కురవాలంటే మేఘాలకు కరెంట్ షాక్ ఇచ్చి కృత్రిమ వర్షాలు పడే విధంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రోన్ల సహాయంతో వర్షాలు కురిసేలా చేస్తున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా విద్యుత్ సరఫరా కావడంతో ఆకాశంలో మేఘాలు కరిగి అందులో ఉన్నటువంటి నీరు వర్షంలా కింద పడే విధంగా ఎలక్ట్రికల్ చార్జింగ్ టెక్నాలజీని శాస్త్రవేత్తల ప్రయోగించారు.
ఈ విధమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి వర్షం కురిపించే విధానాన్ని క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తారు.డ్రోన్ల సహాయంతో మేఘాలలోకి విద్యుత్ ప్రవహించే చేసి మేఘాలలో ఉన్నటువంటి నీటిని కిందికి రప్పించడమే ఈ క్లౌడ్ సీడింగ్. ఈ విధంగా కృత్రిమ వర్షాలు కురిపించడం వల్ల కరువు పరిస్థితుల నుంచి బయటపడటమే కాకుండా వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గి, కొంత మేర నీటి కరువును కూడా అదుపు చేయవచ్చు. రసాయనాల ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించడం కన్నా ఈ విధమైనటువంటి విద్యుత్ సరఫరా చేసి కృత్రిమ వర్షాలను కురిపించడం ఎంతో ఉత్తమమని భావించే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను నిర్వహించారు.
Share your comments