Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

వర్షాలు కురవడానికి మేఘాలకు కరెంట్ షాక్.. ఎక్కడంటే!

KJ Staff
KJ Staff

ప్రస్తుతం భారతదేశంలోనూ, చైనాలో అధిక వర్షపాతం నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉండగా..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడ ప్రజలు తీవ్ర వేడి కారణంగా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. యూఏఈవర్షాలు కురవక పలుప్రాంతాలలో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి అక్కడ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేశారు.

దేశంలో వర్షం కురవాలంటే మేఘాలకు కరెంట్ షాక్ ఇచ్చి కృత్రిమ వర్షాలు పడే విధంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రోన్ల సహాయంతో వర్షాలు కురిసేలా చేస్తున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా విద్యుత్ సరఫరా కావడంతో ఆకాశంలో మేఘాలు కరిగి అందులో ఉన్నటువంటి నీరు వర్షంలా కింద పడే విధంగా ఎలక్ట్రికల్ చార్జింగ్ టెక్నాలజీని శాస్త్రవేత్తల ప్రయోగించారు.

ఈ విధమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి వర్షం కురిపించే విధానాన్ని క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తారు.డ్రోన్ల సహాయంతో మేఘాలలోకి విద్యుత్ ప్రవహించే చేసి మేఘాలలో ఉన్నటువంటి నీటిని కిందికి రప్పించడమే ఈ క్లౌడ్ సీడింగ్. ఈ విధంగా కృత్రిమ వర్షాలు కురిపించడం వల్ల కరువు పరిస్థితుల నుంచి బయటపడటమే కాకుండా వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గి, కొంత మేర నీటి కరువును కూడా అదుపు చేయవచ్చు. రసాయనాల ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించడం కన్నా ఈ విధమైనటువంటి విద్యుత్ సరఫరా చేసి కృత్రిమ వర్షాలను కురిపించడం ఎంతో ఉత్తమమని భావించే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను నిర్వహించారు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More
MRF Farm Tyres