Agripedia

వర్షకాలంలో పంట సాగు-విత్తన శుద్ధి ప్రాముఖ్యత!

KJ Staff
KJ Staff
Seed Cleaning
Seed Cleaning

వ్యవసాయం లాభసాటిగా మారలంటే పలు రకాల మెళుకువలతో సాగులో ముందుకు సాగాలని వ్యవసాయ పరిశోధకులు, నిపుణులు సూచిస్తున్నారు. మరీ మఖ్యంగా పంట దిగుబడి అధికంగా రావాలంటే మెరుగైన సాగు యాజమాన్య పద్ధతులతో పాటు నాటే విత్తనం నాణ్యత చాలా కీలకం అందుకే రైతులు సాగు చేయాలనుకునే పంట విత్తనాలు మార్కట్ లో రకరకాల కంపెనీలు అందుబాటులో ఉంచుతున్నాయి. కాబట్టి మనం పండించే నెల, నీటి వనరులు సరిపడే విధమైన విత్తనం ఎంపిక చేసుకోవాలి.  దీని వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చి.. రైతులకు మంచి ఆదాయం అందిస్తాయి.

విత్తన శుద్ధి ప్రాముఖ్యత:

విత్తన ఎంపికలో తీసుసుకునే జాగ్రత్తలు విత్తనం నాటే ముందు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల్లో ముఖ్యమైంది విత్తన శుద్ధి అని వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన విత్తన ఎంపికతో పాటు ఆ విత్తనాన్ని శుద్ధి చేసి విత్తుకోవడం సైతం అంతే ముఖ్యమైన విషయం అనీ, విత్తన శుద్ధి వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం నిల్వ చేసే సమయంలో వాటిలో చేరిన శిలీంద్రాలు, ఇతర క్రీములు నశిస్తాయి. విత్తనాలను ఎక్కువ కాలం కూడా నిల్వ చేయవచ్చు. ఈ సమయంలో వాటిని చీడపీడలు, బ్యాక్టీరియా సహా ఇతర శిలీంద్రాలు ఆశించే అవకాశముండదు. నేలలో (భూమిలో) ఉంటే ఇతర సూక్ష్మజీవులు సైతం వాటిని చేరకుండా ఉంటాయి. దీని వల్ల మొలక శాతం పెరుగుతుంది. చిరు మొక్కలను తినే పురుగుల నుంచి సైతం రక్షణ లభిస్తుంది. దీంతో మొలకలు చనిపోయే శాతం తగ్గిపోయ.. మళ్లీ అందులో విత్తనాలను నాటుకోవాల్సిన అవసరం ఉండకపోవడంతో ఒకే రీతిలో మొలకలు పెరుగుతాయి. పలు రకాల తెగుళ్ల బారినపడకుండా విత్తన శుద్ధి చర్యలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విత్తన శుద్ధి దాదాపు ఒకే రకంగా అనిపించినా వాడే మందులు, రసాయనాలు కొద్దిమేర వేరువేరుగా ఉంటాయి. పంట రకాన్ని బట్టి విత్తన శుద్ధి మందులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతికూల ప్రభావం ఏర్పడటం వంటివి అసలు ఉండవు. దీనికి తోడు పురుగు లేదా తెగుళు సోకిన తరువాత పిచికారి చేసే మందులకు అయ్యే ఖర్చులో 10 శాతం కంటే తక్కువే విత్తనశుద్ధి కి అవుతుంది.

విత్తన శుద్ధి రకాలు:

విత్తన శుద్ధి రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి పొడివిత్తన శుద్ధి. రెండోది తడి విత్తన శుద్ధి. ఆయా రకాల పంటలను బట్టి విత్తన శుద్ధి కోసం ఉపయోగించే మందులు ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్నాయి. కాబట్టి రైతులు దానికి అనుగుణంగా వాటితో విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి. తడి లేదా పొడి పదర్థాలలతో కూడిన రసాయన మందులతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు . వర్షకాలంలో వచ్చే అనేక పంట తెగుళ్ల ప్రభావాన్ని శుద్ధి చేసిన విత్తనాలు విత్తుకోవడంతో తగ్గించవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More