Agripedia

నువ్వుల పంట సాగులో వచ్చే తెగుళ్లు, నివారణ చర్యలు ఇవే!

KJ Staff
KJ Staff

నూనే గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అందులో నువ్వులు నూనేకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందుకే రైతులు నువ్వుల పంటను అధికంగా సాగు చేస్తుంటారు. అయితే, రైతులు అనుకున్న దిగుబడి.. మంచి ఆదాయం రావాలంటే నువ్వుల సాగులో తీసుకునే యాజమాన్య పద్ధతులు చాలా కీలకమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు మొలకెత్తే సమయంలోనూ, పూత దశలోనూ, కాత దశలో నువ్వులకు పలు రకాల తెగుళ్లు సోకుతాయని పేర్కొంటున్నారు. వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు వెల్లడించిన నువ్వుల పంటకు వచ్చే తెగుళ్లు, నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వుల పంటకు ప్రారంభంలో వచ్చే తెగుళ్లలో ప్రధానమైనది కాండం, వేరుకుళ్లు తెగులు ఒకటి. భూమిలో నివాసముండే పలు రకాల శీలింద్రాల కారణంగా నవ్వుల పంటకు ఈ తెగులు సోకుతుంది. దీని కారణంగా మొక్కల వేర్లు, కాండం కుళ్లిపోతుంది. దీంతో మొక్కలు చనిపోతుంటాయి. ఈ తెగులు సోకకుండా నివారణ కోసం 1.0 గ్రాముల కార్బండాజిమ్ ను లీటరు నిటిలో కలుపుకుని మొక్కలకు అందించాలి. విత్తనాలు నాటిన తర్వత మొలకెత్తే సమయంలో నువ్వుల పంటలో వచ్చే సాధారణ తెగులు గడ్డిచిలుక తెగులు. గడ్డి చిలుకలు మొక్క మొదళ్లకు చేరి.. దాడి చేస్తుంటాయి. దీని కారణంగా మొక్కల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. పంట నాణ్యత, ఎదుగుదల దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. గడ్డి చిలుకల నివారణ కోసం ప్రస్తుతం మార్కెట్ లో అనేక రాకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని పిచుకారీ చేసుకోవాలి.

 

నువ్వుల పంటను మూడు వారల నుంచి నెల రోజులకు చేరిన క్రమంలో ఆకు నల్లి పురుగులు, పెనుబంక పురుగులు, తామర పురుగులు ఆశిస్తాయి. ఇవి మొక్కల ఆకులు, కొమ్మలు, కాండం వంటి భాగాలపైకి చేరి మొక్కల రసాన్ని పీల్చుతాయి. దీని కారణంగా మొక్కలు క్షీణించడంతో పాటు ఆకులు మూడుచుకుపోయి రాలిపోతుంటాయి. క్రమంగా మొక్కలు బలహీన పడి ఎదుగుదల ఆగిపోతుంది. రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఒకటిన్నర మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ ను లీటరు నీటితో కలుపుకుని పంటపై పిచుకారీ చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine