రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.. పత్తివిత్తనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీటీ పత్తి విత్తనాల ధరలను నిర్ణయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.ముందే పెట్టిన పెట్టుబడికి సరైన ధర నష్టాల బాట పడుతున్న రైతులకు ఈ నిర్ణయం మరింత భారం కానుంది .
475 గ్రాముల బీజీ-1 విత్తనాల ధరను రూ.635గా, బీజీ-2 విత్తనాల ధరలను రూ.853గా ప్రకటించింది. బీజీ-2 విత్తనాల ధర ప్రస్తుతం రూ.810 ఉండగా రూ.853కి పెంచింది. బీజీ-1 విత్తనాల ధరలను గతేడాదిలాగే ఉంచింది.
మరో వైపు వ్యాపారులు సిండికేట్లుగా మారి రైతులను నష్టాల్లో ముంచుతున్నారు. దీనితో పత్తి ధర భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు పత్తి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.7500 నుండి రూ.7700 ధర పలుకుతుంది. దిగుబడి తగ్గినా ధరలు బాగానే ఉంటాయి అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పతిని పండించిన రైతులు నష్టాల్లో మునుగుతున్నారు.
తెలంగాణాలో కొనుగోలు లేకపోవడంతో మహారాష్ట్ర కు పత్తి అక్రమ తరలింపు..
ఎంత ఎదురు చుసిన పతి ధరలు పెరగకపోవడంతో రైతులు క్వింటాలు పతికి రూ.15000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు కూడా చేసారు. ఫిబ్రవరి 6న జిల్లాలో రైతు హక్కుల పోరాట సమితి ద్వారా బంద్ కూడా నిర్వహించారు. ఇంత జరిగిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రైతులు నిరాశ చెందారు. పత్తి ధర పెరుగుతుందనే చిన్న ఆశతో రైతులు ఇన్ని రోజులు పత్తిని ఇంటివద్దనే నిల్వ చేసారు. ప్రతి రోజు తగ్గుముఖం పడుతున్న పత్తి ధరలను చూసి రైతులు చేసేది ఏమిలేక పండించిన పత్తి పంటను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు.
Share your comments