News

తెలంగాణాలో కొనుగోలు లేకపోవడంతో మహారాష్ట్ర కు పత్తి అక్రమ తరలింపు..

Srikanth B
Srikanth B
Cotton
Cotton

తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి ఆగోమ్యగోచరంగ మారింది పడిపోయిన పత్తి ధరలు ఒకవైపు , జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడం పోవడంతో పత్తి ధరలు గరిష్టంగా పడిపోయాయి ,రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక జిన్నింగ్‌ మిల్లు ఏటా ఫిబ్రవరి నాటికి 1.80 లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేసేది. ఈ సారి 15,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది అంటేనే రాష్ట్రము లో పత్తి కొనుగోళ్లు ఏ మేరకు పడిపోయాయి అనేది అర్ధం అవుతుంది .

 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 1.97 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పత్తి మార్కెట్‌ సీజన్‌ అక్టోబరు నుంచి మార్చి వరకు ఉంటుంది. అక్టోబరులో పత్తి ధర క్వింటాకు రూ.9 వేలు పైగా పలికింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గడం, పెట్టుబడులు, కూలీల ఖర్చులు పెరగడంతో మెరుగైన ధర కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం క్వింటా ధర రూ.7000 లకు పడిపోయింది దీని అదనుగా భావించిన దళారులు రైతుల పంటను పొలం వద్దనే కొనుగోలు చేసి పత్తి ను టాక్స్ చెల్లించకుండా మహారాష్ట్రకు తరలిస్తున్నారు .

రైతన్నలు ఈ పథకం లో చెరితే .. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ పొందవచ్చు !

మార్కెట్‌ ప్రారంభంలో పత్తి క్వింటా ధర రూ.9 వేలు పలికినా తర్వాత పత్తి, బేళ్ల ధర పెరుగుతుందని జిన్నింగ్‌ మిల్లు నిర్వాహకులు కొనుగోలు చేశారు. బేళ్లుగా చేసి నిల్వ చేస్తూ వచ్చారు. అంతర్జాతీయంగా నూలు ధరలు తగ్గడంతో స్పినింగ్‌ మిల్లులు బేళ్లను తక్కువగా కొనుగోలు చేశారు. దీంతో జిన్నింగ్‌ మిల్లుల వద్ద నిల్వలు పెరిగాయి. ఎక్కువ ధరకు కొనుగోలు చేసినపుడు క్వింటా బేళ్లు రూ.30వేల పైనే ఉండేది. ప్రస్తుతం రూ.17,500లకు పడిపోయింది. మార్కెట్లలో నిరంతరం పత్తి కొనుగోళ్లు జరగడం, వాటికి అనుగుణంగా బేళ్ల ఎగుమతులు జరుగుతుంటే జిన్నింగ్‌ మిల్లులు నిరంతరం నడిచేవి. ప్రస్తుతం వారంలో రెండు, మూడు రోజులు కూడా నడిచే పరిస్థితి లేదు.

రైతన్నలు ఈ పథకం లో చెరితే .. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ పొందవచ్చు !

Related Topics

cotton

Share your comments

Subscribe Magazine