News

పడిపోయిన పత్తి ధరలు.. ఆందోళనలో రైతులు

Gokavarapu siva
Gokavarapu siva

రైతులను మొన్నటి వరకు ఊరించిన పత్తి ధరలు సరిగ్గా విక్రయ సమయంలో తగ్గడం అనేది విచారణకు గురి చేస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పత్తి ధరలు భారీగా తగ్గడంతో రైతులను అయోమయ స్థితిలో ఉంచింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల కంటే ప్రైవేటులో స్వల్పంగా ఎక్కువ ఇవ్వడంతో కస్టపడి శ్రమించి సాగు చేసిన పంటను అమ్ముకోవడానికి రైతులు ఇష్టపడటం లేదు. పత్తి ధర క్విన్టల్ కు 10 వేల రూపాయలు గత ఏడాది పలికింది. ఈ ఏడాది ప్రారం భంలో కూడా అమాంతంగా పెరిగిన ధర ఒక్కసారిగా పడిపోయింది. సిండికేట్‌గా మారిన వ్యాపారులు వీలైనంత తక్కువ ధర చెల్లించి కొనుగోలు చే సేందుకు సిద్ధపడడంతో ఈ పరిస్ధితి నెలకొంది. సీజన్‌ ఆరంభంలో క్వింటాలుకు 9 వేల రూపాయల వరకు పలికింది. పత్తి ప్రస్తుతం క్వింటాలుకు 6,500 రూపాయలకు పడిపోవడం గమనార్హం. పత్తి సేకరించే సమయంలో పెరుగుతుందనుకున్న ధరలు అమాంతం తగ్గడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

రైతులకు పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు అమ్మడం అనేది సవాలుగా మారింది. ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రైవేట్ మార్కెట్లో పతికి మద్దతు ధర కొద్దిగా అధికంగా ఉండటంతో రైతులు ప్రైవేటు వైపే మొగ్గుచూపుతున్నారు. పైగా ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటుచేయలేదు. దీనితో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటును ఆశ్రయించాల్సి వస్తుంది. జిల్లాలో ఈ ఏడాది 1.54 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అయింది. ఎకరాకు 10 నుంచి 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

అయితే భారీ వర్షాల కారణంగా నీట మునగడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తుందని రైతులు దిగులు చెందుతున్నారు. పంట దిగుబడి తగ్గడంతో ఈ ఏడాది అధికంగా రేటు లభిస్తుందనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. మార్కెట్‌కు కేవలం 9 లక్షల క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు 6,380 రూపాయలు ప్రకటించింది. ప్రైవేటు మార్కెట్‌లో సైతం క్వింటాలుపై 6 వేల నుంచి 7 వేల రూపాయల వరకు మాత్రమే ధర పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..

గిట్టుబాటు ధర కోసం రోడ్డు పైకి ప్రత్తి రైతుల..

పత్తి ధర ఒక్కసారిగా పతనమవ్వడంతో, రైతులు సేకరించిన పత్తిని మార్కేలోకి విక్రయించకుండా తమ ఇళ్ల వద్దనే నిల్వ చేసుకుంటున్నారు. ఆశించిన ధర వచ్చే వరకు పత్తిని విక్రయిచకుండా నిల్వచేయాలని రైతులు భావిస్తున్నారు. మరొకవైపు పత్తి ధరలు రోజోరోజుకి తగ్గుతూనే ఉండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది పత్తిని అమ్మిన తర్వాత ఒక్కసారిగా ధర పెరిగింది. ఈ సంవత్సరం కూడా కలిసి వస్తుందేమోనన్న ఆశతో ఉన్నారు. ఈ కారణంగా మార్కెట్‌కు తరలించకుండా ఇంటి వద్ద నిల్వ చేస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పత్తి ఇంకా రైతుల వద్దనే నిల్వ ఉంది.

ఇది కూడా చదవండి..

గిట్టుబాటు ధర కోసం రోడ్డు పైకి ప్రత్తి రైతుల..

Related Topics

cotton crop

Share your comments

Subscribe Magazine