Agripedia

Strawberry cultivation:స్ట్రాబెర్రీ మొక్కల పెంపకం

KJ Staff
KJ Staff
Strawberry Plant
Strawberry Plant

ట్రాబెర్రీలు రుచి, రంగు, పోషకాలు అన్నింటిలో అద్భుతమైన పండ్లు ఇవి. విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామంది వీటిని ఇష్టపడతారు.

వీటిని ఇంట్లో చాలా సులభంగా తక్కువ ఖర్చుతోనే పెంచుకోవచ్చు. స్ట్రాబెర్రీలు ఎక్కువ కాలం నిలిచి ఉండాలంటే ప్రీ కూలింగ్ యూనిట్ లో ఉంచాలి. అదే ఇంట్లోనే పండించుకుంటే నచ్చిన సమయంలో వాటిని తినే వీలుంటుంది.

విత్తనాలు ఎప్పుడు నాటాలంటే..

స్ట్రాబెర్రీలు వేడి వాతావరణంలో ఎండ బాగా ఉన్న సమయంలో మొలకెత్తుతాయి. అందుకే మార్చి, ఏప్రిల్ నెలలు వీటిని నాటేందుకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మే నెలలోనూ నేరుగా ఎండ వేడికి వాటిని ఉంచకుండా పెంచుకోవచ్చు.

మొక్క పెంచడానికి ఏం కావాలంటే..

స్ట్రాబెర్రీ పెంచాలంటే కొన్ని రకాల ఎక్విప్ మెంట్ కావాల్సి ఉంటుంది.

* కుండీ లేదా కంటెయినర్

* షార్ప్ గా ఉండే టూల్

* స్ట్రాబెర్రీ గింజలు

* నీళ్లు

* కుండీల్లో వేసేందుకు మట్టి

* లిక్విడ్ ఫర్టిలైజర్

స్ట్రాబెర్రీ మొక్క పెంచేందుకు చాలా ఎండ కావాల్సి ఉంటుంది. అందుకే ఎండ తగిలేలా ఒక మంచి ప్రదేశాన్ని సెట్ చేసుకొని అక్కడ మొక్కను నాటుకోవాలి. ఈ కుండీ ఉన్న ప్రదేశంలో కనీసం ఆరు గంటల పాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. ఎండ వేడి మొక్క ఎదుగుదల, సూర్య కాంతిపై ఆధారపడి ఉంటుంది.

మట్టి ఎలా ఉండాలంటే..

ఈ కుండీలో మంచి నాణ్యత గల మట్టితో పాటు మురుగు నీటి పారుదల బాగా ఉండేలా చూసుకోవాలి. కింద నీళ్లు పోవడానికి చిన్న రంధ్రం కూడా ఉండేలా చూసుకోవాలి. ఈ మట్టిలోనే ఎరువులు కలుపుకొని గింజలు వేసుకోవాలి.

ఎలా నాటుకోవాలంటే..

మొక్కల నారు లేదా స్ట్రాబెర్రీ పై భాగాన్ని కుండీల్లో నాటుకోవాలి. దీనికి కొంత సమయం ఉంచితే చాలు.. ఆకులు వేస్తాయి. కంటెయినర్ నిండా అందమైన ఆకులతో మొక్క చాలా బాగుంటుంది. ఒకే కంటెయినర్ లో ఎక్కువ మొక్కలు నాటకపోవడం మంచిది. వీటినకి తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. ఫీట్ స్థలానికి మూడు మొక్కలను నాటుకోవాలి. కంటెయినర్ కొలతలు తీసుకొని ఎన్ని మొక్కలు నాటుకోవాలన్న విషయం నిర్ధారించుకోండి.

మొలకలు నాటుకోవడం ఎలాగంటే..

మొలకలు నాటేటప్పుడు మొక్క కాండం మట్టి పైన వచ్చేలా చూసుకోవాలి. దీనికోసం మీరు వేళ్లు మట్టి కిందకు వచ్చేలా చిన్న కుప్పలా చేసి అందులో నాటుకోవచ్చు. మరీ లోతుగా నాటకూడదు. ఆ తర్వాత నీళ్లు పోయాలి. మట్టి ఎక్కువగా పోయడం సరి కాదు. ఇలా మొక్కలు నాటిన తర్వాత మరీ పొడిగా ఉండకుండా చూసుకోవాలి. అలాగని మరీ ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదు. నేల కాస్త తడి పొడిగా ఉన్నప్పుడే మళ్లీ నీళ్లు పోసుకోవాలి. పై లేయర్లలో నీళ్లు త్వరగా ఆవిరైపోతాయి. కింద లేయర్లు తడిగానే ఉంటాయి కాబట్టి రోజుకి ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. వేసవిలో రెండు సార్లు నీళ్లు పోయాల్సి ఉంటుంది. దీనికి ఎండ తగలడం కూడా ముఖ్యమే. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఎండ తగలాల్సి ఉంటుంది. అంతే కాదు.. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి దీన్ని తిప్పుకోవాలి. దీనివల్ల మొక్క అన్ని వైపులా సమానంగా పెరుగుతుంది. మొక్కలను ఈగలు, కీటకాలు, పక్షుల బారి నుంచి కాపాడుకునేందుకు నెట్ కూడా ఉపయోగించవచ్చు.

ఫర్టిలైజర్లు కూడా ఎంతో ముఖ్యం

మొక్కలు బాగా పెరగడానికి పెద్ద, రుచికరమైన పండ్లు రావడానికి దానికి ఎరువులు అందించడం ఎంతో అవసరం. అందుకే స్ట్రాబెర్రీ మొక్కకి కూడా ఎండాకాలంలో ఒకసారి తర్వాత చలి కాలంలో మరోసారి ఫర్టిలైజర్ అందించాల్సి ఉంటుంది. చలికాలం తర్వాత చిన్న చిన్న మొగ్గలు వేయడం ప్రారంభమవుతుంది. అందులోంచి పూలు, పండ్లు వస్తాయి. చలి కాలంలో ఈ మొక్కలు నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఒక వేళ చలికాలం సాధారణంగా కొనసాగితే ఇవి చక్కటి పండ్లను అందిస్తుంది. చలి కాలంలో కంటెయినర్ పగిలిపోతే వేళ్లు గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే గడ్డ కట్టని వాతావరణం ఉన్న చోట దాన్ని ఉంచాలి. మట్టి చాలా పొడిబారినప్పుడు మాత్రమే నీటిని అందించాలి.

https://krishijagran.com/agripedia/strawberry-cultivation-in-india-arid-area-miracle/

https://krishijagran.com/agriculture-world/inoculate-bacteria-to-increase-strawberry-production/

Share your comments

Subscribe Magazine