Agripedia

పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?

Srikanth B
Srikanth B
పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?
పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?

 

పామ్ ఆయిల్ వివిధ వంటలలో వీరి గ వాడే ఈ నూనె కోసం అధిక మొత్తంలో భారత దేశం దిగుమతి పై ఆధారపడి ఉంది . ఏటా ప్రతి పౌరుడు సగటున 16. 5 కిలోలు నూనెను తీసుకుంటుండంగా భారత దేశంలో వీటియొక్క ఉత్పత్తి 8. 5 కిలోలుగా ఉంది .దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాలు పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహిస్తున్నాయి . భారతదేశలోనే పామ్ ఆయిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా 2020-2021 కు గాను 204016 మెట్రిక్ టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి తో ఆంధ్రప్రదేశ్ నిలువగా 39392 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ రెండొవ స్థానంలో నిలిచింది .

 

పామ్‌ ఆయిల్‌ సాగులో తెలంగాణ :

2019 లో పామ్‌ ఆయిల్‌ సాగు పై నియమించబడిన B.M.C రెడ్డి కమిటీ 2020 లో తన నివేదిక్కను వెల్లడించింది . 2022 వ సంవత్సరానికి గాను తెలంగాణాలో పామ్‌ ఆయిల్‌ సాగుకు యోగ్యమైన భూమి 4. 69 లక్షల హెక్టారుల భూమి కమిటీ గుర్తించింది . 2012 లో 50000 హెక్టారుల భూమిని ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ పామ్‌ ఆయిల్‌ పాలం ఆయిల్ సాగులో నల్లగొండ, ఖమం , కొత్తగూడం , సూర్యాపేట జిల్లాలు అగ్రగామిగా ఉన్నాయి . 18-11-2022 న జరిగిన ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్వహించిన గ్లోబల్ రౌండ్‌టేబుల్‌లో KTR మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్రం నిశితంగా పని చేసిందని, దీని వల్ల 40 లక్షల ఎకరాలకు పైగా కమాండ్ ఏరియా (ఇరిగేషన్ సోర్స్ ద్వారా విశ్వసనీయంగా సాగునీరు అందించగల ప్రాంతం విస్తీర్ణం) పెరిగిందన్నారు. ) ఏడేళ్లలో తెలంగాణలో సాగు విస్తీర్ణం రెండింతలు పెరిగింది. అదేవిదంగ తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ మరియు ఇతర నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. ఇవి దేశం యొక్క స్వయం సమృద్ధికి దోహదం చేస్తాయి . తద్వారా ముడి నూనె ధరలు తగ్గి రాష్ట్రము, దేశము నూనె ఉత్పత్తిలో స్వయం సంవృద్ధి సాదిస్తుందని తెలిపాయి .

కాశ్మీరీ కుంకుమపువ్వు కు GI ట్యాగ్, కిలో కు 5 లక్షలు !

ఆంధ్రప్రదేలో పామ్‌ ఆయిల్‌ సాగు:(TOP 5 Districts in Palm oil production of A.P )

దేశం లో పామ్ ఆయిల్ సాగులో ఆంధ్రప్రదేశ్ 240016 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో అగ్రగామిగా నిలిచింది . అందులో అధికముగా ఈ క్రింది 5 జిల్లాలలో సాగు జరుగుతుంది . అవి : శ్రీకాకుళం 40000 మెట్రిక్ టన్నులు ,విజయనగరం 20000 మెట్రిక్ టన్నులు ,విశాఖపట్టణం 14500 మెట్రిక్ టన్నులు,ఈస్ట్ గోదావరి 12500 మెట్రిక్ టన్నులు పామ్ ఆయిల్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచాయి . పామ్‌ ఆయిల్‌ సాగు ప్రతి సంవత్సరం వృద్ది ని నమోదుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సాగును మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది .

30% తక్కువ ఎరువుతో అధిక దిగుబడి .. IIRR పరిశోధకులు సృష్టి !

Share your comments

Subscribe Magazine