వేసవి కాలం అంటే నిమ్మ ధరలు అమాంతంగా పెరిగి ఆకాశాన్ని అంటుతాయి. ఎందుకంటే వేసవికాలంలో నిమ్మకు ఉన్న డిమాండ్ అలాంటిది. గత సంవత్సరం ఐతే నిమ్మకాయ ధర ఒకటి 10 రూపాయలు వరకు పలికింది. నిమ్మ ధరలు ఇంతలా పెరిగిన కూడా రైతులకు లాభం లేకుండా పోతుంది. నిమ్మ పంటను తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తున్నాయి. ఈ తెగుళ్ల కారణంగా నిమ్మ పంట నుండి వచ్చే దిగుబడి తగ్గిపోతుంది. దినితో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి.
ప్రస్తుతం ఈ నిమ్మచెట్లను పేనుబంక మరియు వేరుకుళ్లు తెగుళ్లు అధికంగా ఆశిస్తున్నాయి. ఈ తెగుళ్లు నిమ్మచెట్లను ఆశించడం వలన అవి ఎండిపోతున్నాయి. మార్కెట్లో నిమ్మకు అధిక ధరలు పలుకుతున్న సమయంలో నిమ్మచెట్లు పాడవడంతో రైతులు దిగులు పడుతున్నారు.
దీనితోపాటు దీర్ఘకాలిక తోటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే సాధారణ పంటల మాదిరిగానే ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని నిమ్మ రైతులు కోరుతున్నారు. నిమ్మ రైతులు ప్రతి సంవత్సరం ఈ-క్రాప్ చేయించుకుంటున్నా నష్టపరిహారం అందించట్లేదని రైతులు చెబుతున్నారు.
ఈ వేరుకుళ్లు తెగులతో ఇప్పటికే చాలా నిమ్మ చెట్లు రైతులు కోల్పోయారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఉద్యానవన అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. ఈ వేసవిలో ధర బాగుందనుకున్న సమయంలో తెగుళ్లతో చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి.
ఇది కూడా చదవండి..
గూగుల్ పే, ఫోన్ పే యూసర్లకు షాక్..రూ.2,000 దాటితే అదనపు చార్జీలు
నిమ్మ చెట్లను కాపాడుకోవడానికి ఈ వేరుకుళ్లు తెగులును ముందుగా పసిగడితే చాలు. ఈ తెగులు సోకినప్పుడు ప్రారంభ దశలో ఆకులు వాడిపోతాయి. దీనిని నివారించడానికి ట్రైకోడెర్మావిరిడిని వంద కిలోల పశువుల ఎరువును అర కిలో ప్యాకెట్‌ను కలుపుకుని చెట్టు పాదులో వేయాలి. పేనుబంక నివారణకు ఐతే ఒక లీటరు నీటిలో రెండు ఎంఎల్ రోగర్‌ను కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది.
నిమ్మ తోటలను లవరం, ముద్దనూరు, జమ్మలమడుగు, కొండాపురం మొదలకు మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. జమ్మలమడుగు మండలం గండికోటలోనే సుమారు 20 వేల వరకు నిమ్మ చెట్లు ఉన్నాయి. రెండేళ్లుగా పేనుబంక, వేరుకుళ్లు తెగులు రైతులను కలవరపెడుతున్నాయి. ఎన్ని మందులు వాడినా అదుపులోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడంతో నిమ్మకు డిమాండ్ పెరిగింది. ఇలాంటి సమయాల్లో రైతులు నష్టపోకుండా దీనికి అధికారులు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments