News

గూగుల్ పే, ఫోన్ పే యూసర్లకు షాక్..రూ.2,000 దాటితే అదనపు చార్జీలు

Gokavarapu siva
Gokavarapu siva

డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లిపులకు సంబందించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు చేసేవారిపై అదనపు భారం పడనుంది. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ పేమెంట్స్ ని ఎక్కువగా ప్రోత్సహించింది, కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సిఫార్సుల్లో ఎటువంటి మార్పులు చేయకుండా వాటిని యధాతథంగా అమలు చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ కారణంగా యూపిఐ ద్వారా చెల్లింపులు చేసేవారిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాధమిక నిర్ణయం తీసుకుంది. ఈ నియమాలు అనేవి కొత్త ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.

ఎన్సీపీఐ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి యూపిఐ ద్వారా చేసే ఆర్ధిక మరియు వ్యాపార చెల్లింపులపై అదనపు ఛార్జీలను వసూలు చేయడానికి ఒక సర్కులర్‌ను జారీ చేసింది. ఈ సర్కులర్‌లో దేశంలో యూపీఐ వినియోగించి నగదు బదిలీలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీలు మరియు డబ్బులు చెల్లించే వారి నుండి అదనపు చార్జీలు వసూలు చేయాలని పేర్కొంది. కేంద్రం కూడా దీనిలో ఎం మార్పులు చేయకుండా అమలు చేయాలనే నిర్ణయంలో ఉంది.

ఇది కూడా చదవండి..

వాట్సాప్ ద్వారా PNR మరియు రైలు లైవ్ స్టేటస్.. ఎలానో తెలుసుకోండి

ఎన్సీపీఐ ఈ సంవత్సరం జనవరి నెలలో డిజిటల్ లావాదేవీలు అనేవి 12.98 లక్షల కోట్ల రూపాయలు జరగగా, ఫిబ్రవరి నెలలో ఇది 12.36 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. ఇందుకొరకు ఎన్సీపీఐ సెప్టెంబర్లో అదనపు చార్జీలపై సమీక్ష నిర్వహిస్తుంది. ఈ సమీక్షలో ఈ అదనపు చార్జీలు పెంచాలా లేదా తగ్గించాలా, అమలు చేయాలా లేదా వద్దా అన్న అంశాలపై చర్చలు జరుగుతాయి.

కేంద్ర ప్రభుత్వానికి ఎన్సీపీఐ సంస్థ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం రూ. 2000 కన్న అధిక లావాదేవీలు యూపీఐ ద్వారా చెల్లిస్తే 1.1 శాతం అదనపు ఛార్జీలను వినియోగదారుడి నుండి ఎన్సీపీఐ వసూలు చేయనుంది. అదనపు ఛార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌ను జారీ చేసేవారు రెమిటర్ బ్యాంక్‌కు వాలెట్-లోడింగ్ సర్వీస్ ఛార్జ్‌గా సుమారు 15 బేసిస్ పాయింట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమాలను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని ఎన్సీపీఐ సూచించింది.

ఇది కూడా చదవండి..

వాట్సాప్ ద్వారా PNR మరియు రైలు లైవ్ స్టేటస్.. ఎలానో తెలుసుకోండి

Related Topics

UPI Google Pay transactions

Share your comments

Subscribe Magazine