News

వాట్సాప్ ద్వారా PNR మరియు రైలు లైవ్ స్టేటస్.. ఎలానో తెలుసుకోండి

Gokavarapu siva
Gokavarapu siva

నేటికాలంలో ఏ పని కావాలన్న స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో చిటికెలో చేసుకుంటున్నాం. బ్యాంక్ పనుల నుండి మనకు కావాల్సిన వస్తువుల కొనుగోలు వరకు అన్ని మనకు స్మార్ట్ ఫోన్తో అయిపోతున్నాయి. ఈ కాలంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ కొరకు వాట్సాప్ యాప్ వినియోగం కూడా అధికంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ లో చెల్లింపులు కూడా చేయవచ్చు. ఈ వాట్సాప్ యాప్ తో మనకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

దీనిని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తూ, ఇప్పుడు మన ఫోన్‌లో ఈ వాట్సాప్ ద్వారా రైలు స్థితి మరియు పిఎన్ఆర్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా వాట్సాప్ లో వినియోగదారుల కొరకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మనం ఐఆర్సిటిసికి సంబంధించిన ఎటువంటి సమాచారం అయిన మన వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇప్పుడు వినియోగదారుల కోసం వాట్సాప్‌లో ఐఆర్సిటిసి రైలోఫీ చాట్‌బాట్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఐఆర్సిటిసి రైలోఫీ చాట్‌బాట్తో మనం ఐఆర్సిటిసి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మన రైలుకు సంబంధించి పిఎన్ఆర్ మైరియు రైలు యొక్క స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

ఈరోజే ఆకాశంలో అద్భుతం..ఒకే వరుసలో 5 గ్రహాలు..మీరు మిస్ కాకండి

ఈ చాట్‌బాట్ ద్వారా మీ గమ్యస్థానం యొక్క ముందు స్టేషన్ లేదా తరువాతి స్టేషన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు వాట్సప్ లో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా రైలోఫీ ఏఐ చాట్‌బాట్ ద్వారా రైలు యొక్క లైవ్ స్టేటస్ కూడా వీక్షించవచ్చు.

వాట్సాప్ లో ఈ ఫీచర్ ని ఉపయోగించాలి అనుకుంటే ముందుగా రైలోఫీ ఏఐ చాట్‌బాట్ వాడాలి. ఇందుకొరకు మీరు మీ ఫోన్ లో +919881193322 సేవ్ చేసుకోవాలి. ఈ ఐఆర్సిటిసి యొక్క నెంబర్ సేవ్ చేసుకున్న తరువాత సెర్చ్ చేసుకుంటే ఏఐ చాట్‌బాట్‌తో కనెక్ట్ అవ్వచ్చు. దీని ద్వారా పిఎన్ఆర్ నంబర్ ఇచ్చి, రైలు లైవ్ స్టేటస్, రైలు ఎక్కడ ఉంది మరియుఎంత ఆలస్యమైందో తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

ఈరోజే ఆకాశంలో అద్భుతం..ఒకే వరుసలో 5 గ్రహాలు..మీరు మిస్ కాకండి

Related Topics

irctc WhatsApp

Share your comments

Subscribe Magazine