ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిన్న ఏసీ మిరపకు రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి క్వింటాలుకు ఏకంగా రూ.
22,800 చొప్పున పలకడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అల్లిపురానికి చెందిన రావూరి సత్యనారాయణ అనే రైతు ఏసీ రకం మిర్చి పండించాడు. మార్కెట్‌కు ఆయన తీసుకొచ్చిన 22 బస్తాల మిర్చిని క్వింటాలుకు రూ. 22,800 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు.
మార్కెట్‌కు మొత్తం 5,546 బస్తాల ఏసీ మిరప బస్తాలు రాగా, ఎండు మిరప 2,058 బస్తాలు, తాలు మిరప 265 బస్తాల సరుకు వచ్చినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా, తేజ రకం మిర్చికి అత్యధిక ధర పలుకుతుండడంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరుకును కూడా తెచ్చి విక్రయిస్తున్నారు. కాగా, ఈ నెల 1న ఏసీ మిరప క్వింటాలుకు రూ.22 వేలు పలకింది. కాగా, మార్కెట్లో నిన్న మిరప కనిష్ఠ ధర రూ. 17,600గా ఉండగా, నమూనా ధర రూ. 20 వేలు పలికింది.
జనవరి 2022 నుండి, తెలంగాణాలో ఇరవై మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది రైతుల పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి . దీనికి తోడు రైతులు చేసిన అప్పులు తీర్చలేక జనవరి 2022 నుండి తెలంగాణలో 20 మందికి పైగా రైతులు ఆత్మహత్యలతో చేసుకున్నారు .
. దీనికి కారణం తెగుళ్ల దాడి వాళ్ళ తీవ్రంగా నష్టపోవడమే దీనికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో మానవ హక్కుల వేదిక మరియు స్వతంత్ర సంస్థ ఈ సమస్యను పరిశోధించడానికి ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
తెలుగు రాష్ట్రాలలో రానున్న వారం రోజుల పాటు వర్షాలు .. హై అలర్ట్ జారీ !
“సాధారణంగా మిర్చి పంటకు ఎకరాకు లక్ష పెట్టుబడి అవసరం. కుటుంబ శ్రమతో పాటు. ఈ సంవత్సరం రైతులు పొలాల్లో లక్షల పెట్టుబడులు పోగొట్టుకున్నారు అని మానవ హక్కుల వేదిక డాక్టర్ ఎస్ తిరుపతయ్య చెప్పారు. అదేవిధంగా ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే దాదాపు 40 వేల హెక్టార్లలో మిర్చి పంటలు ఈ బ్లాక్ త్రిప్స్ తెగులు బారిన పడ్డాయి. మరియు పంటల దిగుబడి 10% కంటే తక్కువకు పడిపోయింది. చాలా మంది రైతులు షెడ్యూల్డ్ తెగల రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులు. వారు తమ పంటలకు ఇంత నష్టాన్ని భరించలేకపోయారు, ”అని మానవ హక్కుల వేదిక డాక్టర్ ఎస్ తిరుపతయ్య చెప్పారు.
Share your comments