Agripedia

మినుము పంటను అధికంగా నష్టపరిచే తెగుళ్లు, నివారణ చర్యలు...!

KJ Staff
KJ Staff

రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న అపరాల సాగులో మినుము పంటకు ప్రత్యేక స్థానం ఉన్నది. మినుము పంటను ఖరీఫ్, రబీ వేసవి కాలాల్లోనూ ప్రధాన పంటగాను మరియు అంతరపంటగాను సాగు చేసుకోవచ్చు. మినుము సాగులో తెగుళ్ళ ఉధృతి అధికంగా ఉండి దిగుబడి పై అధిక ప్రభావం చూపుతుంది.కావున రైతు సోదరులు సరైన సమయంలో తెగుళ్ళ లక్షణాలను గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు.

మినుము పంటను ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులు :

బూడిద తెగులు : ఆకులమీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి.తెగులు ఉధృతి ఎక్కువైతే తెల్లని బూడిదలాంటి పోర పిందెలు, కాయలు, కాండం మీదికి వ్యాప్తి చెందును. క్రమేపి ఆకులు ఎండి రాలిపోతాయి.సాధారణంగా బూడిద తెగులు పగటి వేళల్లో ఎక్కువ వేడిగాను, రాత్రివేళల్లో ఎక్కువ చలిగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.0 మి.లీ హెక్సాకోనాజోల్ లేదా మైక్లోబ్యుటానిల్ లేదా 1.0 గ్రా. కార్బండిజమ్ లీటరు నీటిలో కలిపి అవసరాన్నిబట్టి 10-15 రోజుల వ్యవధిలో మందులను మార్చిమార్చి పిచికారి చేయాలి.

కొరినోస్పోరా ఆకుపచ్చ తెగులు: మినుము పంటకు అధికంగా వ్యాపించి తెగులు.ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి పండుబారి ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 2.0 మి.లీ హెక్సాకోనాజోల్, లేదా హెక్సాకోనాజోల్ కాప్టాన్ (తాకత్) లేదా 2.5గ్రా. మాంకోజెబ్ లేదా 3 గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్లను అవసరాన్ని బట్టి పిచికారి చేయవలసి ఉంటుంది

తుప్పు తెగులు: పంట వేసిన రెండు నెలలకు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొదట ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు నుంచి శిలీంధ్రబీజాలు ఉత్పత్తియై ఆకుపై అంతా తుప్పులాగా ఏర్పడి ఆకులు ఎండి పోయి దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తెగులు నివారణకి లీటరు నీటికి
1.0 మి.లీ. డైనోకాప్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ కలిపి తెగులు ఉదృతిని బట్టి పిచికారి చేయాలి.

Share your comments

Subscribe Magazine