Agripedia

తిప్పతీగల సాగు కోట్లు సంపాదిస్తున్న గిరిజన వ్యాపారి.. ఎలాగంటే?

KJ Staff
KJ Staff

ఎన్నో ఔషధ గుణాలకు నిలయంగా ఉన్న తిప్పతీగను గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఇటు ఆయుర్వేద పరంగాను అటు సైన్స్ పరంగాను తిప్పతీగ లో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో ఎంతోమంది ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన సునీల్ పవార్ అనే యువకుడు తిప్పతీగల సాగుచేస్తూ కోట్లు సంపాదించడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

మహారాష్ట్ర షాహ్ పుర్ తాలూకాలోని ఖరిద్ కు చెందిన సునీల్ కు స్థానిక అడవులలో పెరిగే తిప్పతీగలో ఉండే ఔషధ గుణాల గురించి పూర్తిగా తెలుసుకొని గత రెండు సంవత్సరాల క్రితం తిప్పతీగల సాగు చేస్తూ వివిధ కంపెనీలకు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కట్కరీ తెగకు ఉపాధి కల్పిస్తూ ప్రధానమంత్రి వన్ ధన్ పథకం సాయంతో వన్ ధన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఏడాదికి 3 నుంచి 5 లక్షల ఆదాయం పొందేవాడు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి అధికం కావడంతో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంపొందించుకొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తిప్పతీగలకు అధిక డిమాండ్ ఏర్పడింది. దీంతో సునీల్ ఏకంగా దీంతో డాబర్, బైద్యనాథ్, హిమాలయ వంటి సంస్థలకు 350 టన్నుల తిప్పతీగ సరఫరా చేసేందుకు పెద్ద కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఈ కాంట్రాక్టు కింద అతడు ఏకంగా రూ. 1.57 కోట్ల దక్కించుకున్నాడు. అదే విధంగా ప్రస్తుతం సునీల్ కి ఏకంగా ఆరు వన్ దన్ కేంద్రాలు ఉన్నాయి.

తిప్పతీగ లను ఉపయోగించి ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాలను తయారు చేస్తారు. దీని నుంచి తయారయ్యే పసురు, గుళికలు ఆస్తమా, డయాబెటిస్, జ్వరం, హెపటైటిస్ఇతర గుండెకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా మన శరీరంలో వ్యాధులతో పోరాడటానికి అవసరమయ్యే రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.అందుకే ఈ తిప్పతీగలకు అధిక డిమాండ్ ఏర్పడింది.

Share your comments

Subscribe Magazine