Agripedia

కూరగాయల సాగు.. సేంద్రీయ కలుపు నివారణ మందు తయారు చేసుకోవడం ఎలా?

KJ Staff
KJ Staff

వ్యవసాయంలో పంటల సాగుకు సంబంధించి సస్యరక్షణ చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. మరీ ముఖ్యంగా కలుపు నివారణ అనేది పంట దిగుబడిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కలుపు మొక్కల కారణంగా చీడపీడలు సైతం పంటను ఆశించడానికి కారణమవుతాయి. కాబట్టి ఈ విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అయితే కలుపు మొక్కల నివారణ కోసం రైతులు ఇప్పటికే అనేక రకాల పద్ధతులను అవలంభిస్తున్నారు. వాటిలో ప్రధానంగా చేప్పుకోవాల్సింది.. విత్తనం నాటే ముందు పొలంలో కలుపు నివారణ మందులు చల్లుతున్నారు. అలాగే, పంటలో వచ్చే కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. అధికంగా కృత్రిమంగా త‌యారు చేసిన క‌లుపు నివార‌ణ మందులు పొలంలో చల్లుకోవ‌డం, పిచుకారీ చేయ‌డం ప్ర‌తియేటా చేయ‌డం వ‌ల్ల సాగుపై ప్ర‌భావం ప‌డుతుండ‌ట‌టంతో పాటు భూసారం త‌గ్గిపోతుంద‌ని వ్య‌వ‌సాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే కృత్రిమ క‌ల‌పునివార‌ణ మందులు, పౌడ‌ర్లు వాడ‌టం కంటే వాటి స్థానంలో సేంద్రీయ క‌లుపు నివార‌ణ క‌షాయాలు వాడ‌టం మేల‌ని చెబుతున్నారు.

సేంద్రీయ పద్ధతిలో కలపు నివారణ కోసం ఉపయోగించే వాటిలో గరళ కంఠ కషాయం మెరుగైన ఫలితాలు అందిస్తుంది. గరళకంఠ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సైతం రైతులకు అందుబాటులోనే ఉంటాయి. తయారు చేసుకోవడం, వాడటం కూడా సులభమే. గరళకంఠ కషాయ తయారీకి కావాల్సిన పదర్థాలు: అరలీటరు దేశీ రకానికి చెందిన గోవు పాలు, 100 గ్రాములు చక్కెర, 100 గ్రాముల వివిధ రకాల కలుపు మొక్కల బూడిద.

గరళకంఠ కషాయం తయారీ, వినియోగించే విధానం: మన పొలంలో ఉన్న వివిధ రకాల కలపు మొక్కలను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఆ తరువాత ఆ ముక్కలను పెనంపై బూడిత అయ్యే వరకు వేయించాలి. అందులోంచి వచ్చిన 100 గ్రాముల బుడిద, అర లీటరు దేశీ ఆవు పాలు, 100 గ్రాముల చెక్కెరను ఒక బాటిల్ తో తీసుకుని.. మూడు పదర్థాలు బాగా కలిసేలా చేయాలి. మూడు రోజుల పాటు ఉదయంపూట, సాయంత్రం పూట ఒక నిమిషం పాటు కలపాలి. మిగతా సమయాల్లో బాటిల్ మూత తీయకుండా ఉండాలి. తయారైన గరళకంఠ కషాయం అరలీటరు ద్రావణాన్ని 100 వరకు లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine