Agripedia

'విటమిన్-పి' గురించి ఎప్పుడైనా విన్నారా?అయితే ఇప్పుడు తెలుసుకోండి

KJ Staff
KJ Staff

డాక్టర్లు కానీ న్యూట్రిషనిస్ట్లు ఎవరైనాసరే విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారం తినమని సూచిస్తారు. విటమిన్లు ఆరోగ్యంగా ఉండటానికి మరియు శరీర పనితీరుకు ఎంతగానో తోడ్పడతాయి. ఈ విటమిన్ల్ లోపం కనుక తలెతిన్నట్లైతే ఎన్నో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ విటమిన్లలో ఎన్నో రకాలున్న వాటిలో కొన్ని మాత్రమే మనకు తెలిసినవి. మనకు తెలిసిన విటమిన్-ఏ,బి,సి,డి,ఈ,కే లతోపాటు తెలుసుకోవాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి, వాటిలో విటమిన్-పి ఒకటి. మీ చాల మంది ఈ విటమిన్ గురించి వినివుండరు. అయితే ఈ విటమిన్ మనకు ఎందుకు అవసరమో, మరియు ఎటువంటి ఆహారంలో విటమిన్-పి లభిస్తుందో ఇప్పుడు తెల్సుకుందాం.

అయితే మిగితా విటమిన్లలాగా, విటమిన్-పి ఒక కచ్చితమైన విటమిన్ కాదు. మన తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఫ్లేవినోయిడ్స్ కూడా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం, ఈ ఫ్లేవినోయిడ్స్ని విటమిన్-పి అనికూడా పిలుస్తారు. ఈ ఫ్లేవినోయిడ్స్ ఎన్నో వైద్య పరమైన ఉపయోగాలు కలిగి ఉంటాయి, వీటిలో యాంటీఇంఫ్లమేటరి, యాంటీఆక్సిడెంట్, యాంటీక్యాన్సర్, యాంటీక్యాన్సర్ లక్షణాలు కలిగిఉంటాయి. అంతేకాకుండా వీటికి నరాల వ్యవస్థను మరియు గుండె పనితీరును కాపాడగలిగే ప్రభావం కూడా ఉంటుంది. అయితే ఈ విటమిన్-పి ఎక్కువుగా మొక్కలు ద్వారా లభించే ఆహార పదార్ధాల్లో ఎక్కువుగా కనిపిస్తుంది. విటమిన్-పి కలిగి ఉన్న ఆహారాన్ని ఆస్తమా, అల్లెర్జి మరియు కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

విటమిన్- పి లోపించిన వ్యక్తుల్లో కీళ్లసమస్యలు అధికమవుతాయి, ఆర్ధరైటీస్ సంభందించిన వ్యాధులు రావడం జరుగుతుంది. విటమిన్-పి లోపం ఎక్కువగా ఉంటే, స్కర్వి, చిగుళ్లు మరియు దంతాల సమస్యలు, చర్మం మరియు జుట్టు పొడిబారడం, రక్తహీనత మొదలైన సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా శరీరంలో చిన్న గాయమైన అధిక రక్తస్రావం, గాయాలు సులభంగా మనకపోవడం మొదలైనవి ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

ఈ విటమిన్-పి పొందడానికి ఎన్నో రకాల ఆహార పదార్ధాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విటమిన్ ముదురురంగు కూరగాయలు మరియు పళ్లలో ఉంటుంది, మరియు ఆకుకూరలను కూడా మీ డైట్లో భాగం చేసుకుంటే విటమిన్-పి లభిస్తుంది. దీనితోపాటు బెర్రీలు, ఆలివ్ నూనె, ఉల్లిపాయలు, ద్రాక్ష, సొయా ఉత్పత్తులు, కోకో, టొమాటోలు, స్ట్రబెర్రీలు మొదలైన వాటి నుండి విటమిన్-పి పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine