Agripedia

డ్రోన్ల వినియోగించాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి ? కేంద్రం మార్గదర్శకాలేంటి?

Gokavarapu siva
Gokavarapu siva
What are the permission need to operate drone  in agriculture
What are the permission need to operate drone in agriculture

పైలట్ కంట్రోలర్, రెక్కలు, ఛార్జర్, బ్యాటరీలు, కెమెరాలు, నాజిల్స్ మెమొరీ కార్డులు, టాబ్లెట్‌, క్లౌడ్ ప్రాసెసింగ్‌ కి సమాచారం పంపే సాఫ్ట్‌వేర్ ఇవీ ప్రాథమికంగా డ్రోన్ పరికరాలు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్, చిన్నపాటి జీపీఎస్ మాడ్యూల్స్, అధిక శక్తి కలిగిన కంప్యూటర్ ప్రాసెసర్లు, చిన్నపాటి డిజిటల్ రేడియోస్ అన్నవి డ్రోన్లలోని నూతనత్వాలు. మన దశంలో ఐదు రకాల పరిమాణంలో డ్రోన్లు వాడడానికి కేంద్రం మార్గదర్శకాలిచ్చింది.

అవి నానో, మైక్రో, మిని , స్మాల్, లార్జ్‌. కనిష్టంగా 250 గ్రాములు, గరిష్టంగా 150 కిలోల వరకు బరువుంటాయి. డ్రోన్లు వినియోగించడానికి దేశంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 250 గ్రాములకంటే తక్కువ బరువున్న నానోడ్రోన్ల వాడకానికి ఎటువంటి లైసెన్సు అవసరం లేదు.

అయితే కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల వాడకానికి సంబంధించి కొత్త విధానం తీసుకొస్తోంది. పరిమాణాన్ని బట్టి వాటిని వర్గీకరించి, డ్రోన్‌లకు విశిష్ట గుర్తింపు సంఖ్యలను, రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లనూ తప్పనిసరి చేయబోతోంది. ఇక డ్రోన్ పనిచేసే విషయానికి వస్తే...పైలట్ కంట్రోలర్, మొబైల్ యాప్‌, స్మార్టు‌ఫోన్ లేదా కంప్యూటర్ ఆదేశాల ద్వారా పనిచేస్తుంది. వైమానిక ఇమేజింగ్ మ్యాపింగ్ ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో నడిపించవచ్చు.


డ్రోన్‌ ప్రత్యేకతలు, పనితనంరీత్యా రోజు రోజుకి వీటి అవసరం, వినియోగం పెరుగుతోంది. రైతులు ఎరువులు, పురుగుమందులు చల్లడానికి కూలీలను వెతుక్కోవాల్సిన తిప్పలు తప్పుతాయి. ఎంత పెద్ద కమతాల్లోనైనా పొలం గట్టుపైనే నిలబడి ఒక్క డ్రోన్‌తో నిమిషాల్లో మందులు పిచికారీ చేసేయవచ్చు. ఒక్కసారి డ్రోన్‌ని చేనంతా తిప్పేసి పంట ఎదుగుదల, చీడల జాడని పసిగట్టేయవచ్చు. సూక్ష్మంలో మోక్షంలా బుల్లి విహంగాలతో అద్భుత ప్రయోజనాలున్నా ప్రస్తుతానికైతే ఖరీదు మాత్రం కాస్త ఎక్కువే.


డ్రోన్ సైజు, సామర్థ్యాన్ని బట్టి లక్షన్నర నుంచి 10 లక్షల వరకు పలుకుతున్నాయి. మిగతా యంత్రాల మాదిరిగా ప్రభుత్వమే ప్రతి గ్రామానికి సరఫరా చేస్తే సామాన్య రైతులు వినియోగించుకోగలుగుతారు. ఒకే రకం పంట పొలాల్లో ఒకేసారి పిచికారీ చేయడం వల్ల చీడపీడల తీవ్రత తగ్గుతుంది. ఈ పయనంలో కొన్ని సాంకేతిక అవరోధాలని అధిగమించాల్సిన అవసరముంది. నీడ, వెలుతురు సమస్యలతో ఫోటో నాణ్యత తగ్గే పరిస్థితులకి పరి‌ష్కారం కనుగొనాలి. అలాగే డ్రోన్లు తీసిన ఫోటోలని పరిశీలించి నివారణ మార్గాలు సూచించే వ్యవస్థ, వ్యక్తులను తయారు చేయాలి.

 

చట్టపరంగా, భద్రతపరంగా డ్రోన్లను ఉపయోగించడానికి పైలెట్లకి శిక్షణ ఇవ్వాలి.

అన్నింటికంటే ముఖ్యంగా పంటలపై మూడు నాలుగు అడుగుల ఎత్తు నుంచి గాలిలో రసాయన పురుగుమందులు పిచికారీ చేయడం ద్వారా తలెత్తే సమస్యలు, పర్యావరణ కాలుష్య, ఆరోగ్య ముప్పు అంశాలపై దృష్టి పెట్టాలి. అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు చల్లడానికి, శ్రమ, శక్తిని తగ్గించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు చల్లడానికి ఉపయోగపడుతుండటంతో ఇవి ఎక్కువ మందినే ఆకర్షిస్తున్నాయి.

డ్రోన్ లను ఉపయోగించడం కొరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్:

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ఎస్ వోపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) జారీ చేసింది, ఇది డ్రోన్లు, డ్రోన్ పైలట్లు మరియు డ్రోన్ ఆపరేటర్లు ఏరియల్ క్రిమిసంహారక పిచికారీ ఆపరేషన్ సమయంలో అనుసరించాల్సిన సూచనలు, నిబంధనలు మరియు
ఆవశ్యకతలను జాబితా సూచిస్తుంది అవి :

  • క్రిమిసంహారిణి పిచికారీ చేసే ప్రాంతాన్ని డ్రోన్ ఆపరేటర్ ద్వారా డ్రోన్ పైలట్ ఆ పరిసరాలను ముందు మార్క్ చేయాలి.
  • ఆమోదించబడ్డ క్రిమిసంహారకాలను మాత్రమే ఉపయోగించాలి.
  • ప్రథమ చికిత్స సదుపాయాలను ఆపరేటర్ లకు అందించాలి.
  • ఆపరేషన్ కు సంబంధం లేని జంతువులు లేదా వ్యక్తులు నిర్ధిష్ట కాలం పాటు ఆపరేషన్ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతించరాదు.
  • డ్రోన్ పైలట్ లు క్రిమిసంహారకాల యొక్క క్లినికల్ ప్రభావాలతో సహా క్రిమిసంహారకాల స్పెషలైజేషన్ లో ట్రైనింగ్ ను పొంది ఉండాలి.

Related Topics

agricultural drones

Share your comments

Subscribe Magazine