Agripedia

గంజాయి సాగు చేస్తా.. అనుమతివ్వండి అంటూ..!

KJ Staff
KJ Staff

సంవత్సరం పాటు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో
రైతులు ఆర్థికంగా నష్టపోయి వ్యవసాయం చేయడం భారంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర సోలాపుర్​కు చెందిన ఓ రైతు వినూత్న రీతిలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం సాంప్రదాయ పంటలు సాగు చేస్తుంటే గిట్టుబాటు ధర లేక ఆర్థిక నష్టం వస్తోంది. అందుకే మార్కెట్​లో నిత్యం డిమాండ్​ ఉండే గంజాయి పంటను సాగు చేసేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడంతో ఈ లేఖపై తీవ్ర చర్చ సాగుతోంది.

అసలు వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర సోలాపుర్​కు చెందిన అనిల్​ పాటిల్​ అనే రైతు జిల్లా కలెక్టర్ గారికి పెట్టుకున్న దరఖాస్తులో తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ప్రస్తుతం పండించే పంటలకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదు. అందుకే సాంప్రదాయ పంటలను పంట పండించడం కష్టంగా మారుతోంది. వ్యవసాయం చేస్తుంటే నష్టాల్లో కూరుకు పోతున్నాం. ఇప్పటికే పండించి చక్కెర కర్మాగారాలకు అమ్మిన చెరకు డబ్బులు కూడా చేతికి అందడం లేదు. అందుకే మార్కెట్​లో డిమాండ్ ఉండే గంజాయి పంట సాగు చేసేందుకు అనుమతి ఇస్తే నాకున్న రెండెకరాల్లో సాగు చేసుకుంటాను అని తన దరఖాస్తులో కోరారు.

అలాగే గంజాయి సాగుకు సంబంధించి అధికార యంత్రాగానికి డెడ్​లైన్​ విధించాడు ఆ రైతు. సెప్టెంబర్​ 15వ తేదీలోపు అనుమతి ఇవ్వాలని కోరాడు. లేకపోతే తానే అనుమతి లభించినట్లుగా భావించి సెప్టెంబర్​ 16 నుంచి సాగు చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశాడు. గంజాయి సాగుకు సంబంధించి తనపై ఏదైనా కేసు నమోదు అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని దరఖాస్తులో పేర్కొన్నాడు.

జిల్లా యంత్రాంగం ఆ రైతు పెట్టుకున్న దరఖాస్తును విచారణ నిమిత్తం స్థానిక పోలీస్
స్టేషన్ కు పంపించడం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ సాయ్‌కర్‌ దీనిపై మాట్లాడుతూ రైతు లేఖ ప్రచార ఎత్తుగడగా కొట్టిపారేశారు. ఒకవేళ నిషేదిత గంజాయి సాగును రైతు చేపడితే చట్టపరంగా కేసు నమోదు చేసి కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Share your comments

Subscribe Magazine