భారత దేశ వ్యవసాయ ప్రపంచం లో మహిళల భాగస్వామ్యం చాలా గొప్పది. వ్యవసాయ క్షేత్రంలో మహిళల సహకారం గణనీయంగా పెరుగుతుంది . వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో 18 శాతం మహిళలు వారికై వారు వ్యవసాయం చేస్తూ అందులో రానిస్తు కుటుంబాలలను ముందుకు నడిపిస్తున్నారు. వ్యవసాయ కూలీలలో 33 శాతము వాటా మహిళలదే. దేశంలో అత్యధిక మహిళా రైతులు మహారాష్ట్రలో ఉన్నారు .
భారత ప్రభుత్వం కూడా మహిళలకి పెద్ద పీట వేస్తూ వ్యవసాయ రంగం లో రిజర్వేషన్లు కల్పిస్తుంది ప్రభుత్వానికి సంబంధించి అన్ని పథకాలలో 30 శాతం రిజర్వేషన్లు కేటాయించింది , ఇందులో ముఖ్యంగా
*అగ్రి బిజినెస్ అగ్రి క్లినిక్ సెంటర్లు
*ఆత్మ ( Agricultural Technology Management Agency)
* రాష్ట్ర విస్తరణ కార్యక్రమాలు
*జాతీయ ఆహార భద్రతా మిషన్
*ఆయిల్ సీడ్ & ఆయిల్ పామ్ జాతీయ మిషన్
*జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్
*వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ వంటి పథకాల ద్వారా మహిళలకు చేయూతనిస్తుంది.
భారత ప్రభుత్వం మహిళా కిసాన్ సశక్తికరణ్ పరియోజన అనే పథకాన్ని కేవలం మహిళా రైతుల ప్రయోజనాల దృష్ట్యా 2011 సంవత్సరంలో ప్రవేశ పెట్టింది,వ్యవసాయం లో మహిళా సాధికారతను పెంపొందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం
వ్యవసాయ క్షేత్రంలో ఒక పంట కాలానికి మహిళలు సగటున 3300ల గంటలు పనిచేస్తుండగా పురుషులు కేవలం 1850 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల పనులలో మహిళలు పాలు పంచుకుంటున్నారు రోజు వారి వ్యవసాయ కూలీలుగా లేక వారి సొంత పొలంలోనె పంటలను సాగు చేస్తున్నారు
*విత్తడం
*నీటి పారుదల
*ఎరువులను చల్లుకోవడం
*కలుపు తీయటం
*పురుగు మందుల పిచికారీ
*పంటకోతలు
*ధాన్యాన్ని వేరు చేయటం వంటి పనులు మహిళలు ఉత్సాహంగా చేస్తున్నారు.
అంతే కాకుండ వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా మహిళలు చురుగ్గా ఉన్నారు పాల వ్యాపారం, ఆవుల గేదెల సంరక్షణ మరియు గొర్రెల మేకల పెంపకము వంటి పనులలో భాగస్వాములై ఉన్నారు
వ్యవసాయంలో మహిళలు ఎంతో చురుకుగా ఉన్నప్పటికినీ రోజువారీ కూలీల వేతనాలలో పురుషులకి స్త్రీలకి మధ్య వత్యాసం చాలా ఉంది దీనికి త్వరలోనే స్వస్థి పలుకుతారని కోరుకుందాం.
Share your comments