News

మార్చి 8 :అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సందర్భంగా కృషి జాగరణ్ ప్రత్యేక వెబినర్ల నిర్వహణ !

Srikanth B
Srikanth B

కృషి జాగరణ్ మన దేశంలోని వ్యవసాయ సమాజం కోసం ప్రత్యేక పరిజ్ఞానం అందించడానికి కృషి చేస్తుంది. ఈసారి కృషి జాగరణ్ వివిధ ప్రాంతీయ భాషల నుండి మూడు ప్రత్యేక వెబినర్లు మరియు 10 ఇతర ప్రత్యక్ష సెషన్లను నిర్వహించడం ద్వారా అంతర్జాతీయంగా మహిళా దినోత్సవానికి సందర్భంగా ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం కృషి చేస్తుంది .

గ్రామీణ ప్రాంతాలలో  నివసిస్తున్న వారికి కూడా సాధికారత కల్పించకపోతే మహిళలకు సామాజిక- ఆర్థిక సాధికారత అనేది సాధించబడదు. ఈ పితృస్వామ్య  వ్యవస్థలో మహిళలలకు ప్రతి రంగం లోను సమాన  అవకాశాలు కల్పించడం ఎంతైన వుంది .

 

భారతదేశంలో ఆర్థికంగా చురుకైన మహిళల్లో 80 శాతం మంది వ్యవసాయం లో పనిచేస్తున్నారు; వీరు వ్యవసాయ కార్మిక శక్తిలో 33% మరియు స్వయం ఉపాధి కలిగిన రైతులలో 48% ఉన్నారు. భారతదేశంలోని వ్యవసాయ రంగంలోని మహిళలు విత్తడం నుండి కోత వరకు విస్తృతమైన వ్యవసాయ కార్యకలాపాలను ఎక్కువగా చేస్తారు, అయినప్పటికీ వారికి పురుషులకంటే  వనరులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క జిడిపిలో వ్యవసాయం17. 5 శాతం ఉంది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో మహిళలే అధికంగా కనిపిస్తారు   . గ్రామీణ కార్మిక మార్కెట్లలో మహిళల భాగస్వామ్యం ప్రాంతాన్ని బట్టి చాలా మారుతుంది, , వ్యవసాయ రంగానికి గ్రామీణ మహిళలు అందించిన సహకారానికి సాధికారత కల్పించడానికి కీలక దృష్టితో మహిళల ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. వ్యవసాయాన్ని మార్చే అపారమైన సామర్థ్యం మహిళలకు ఉంది, కానీ వారు సాధికారత పొందేలా మనం ఎలా నిర్ధారించగలం? అనే అంశాలపై

 

, కృషి జాగరణ్ "అగ్రివుమన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఛేంజ్ - ది ఫ్యూచర్ ఆఫ్ ఉమెన్నోమిక్స్" పై మూడు ప్రత్యేక వెబినర్స్ ను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 8 మార్చి 2022. దీనికి అదనంగా, ప్రాంతీయ భాషల్లో 10 వెబినార్లు (మలయాళం, ఒడియా, బెంగాలీ, అస్సామీ , తెలుగు ,పంజాబీ , గుజరాతి మొదలైనవి)  1 వెబినార్ మహిళా జర్నలిస్ట్ ల తో కృషి జాగరణ్ మహిళా సాధికారత అనే అంశం వెబినర్లను నిర్వహించనున్నారు.

ప్రత్యేక వెబినర్స్, టైమింగ్ లు మరియు పాల్గొనేవారి జాబితా:

"అగ్రివుమన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఛేంజ్ - ది ఫ్యూచర్ ఆఫ్ ఉమెన్నోమిక్స్" - ఉదయం 11:00 - మహిళా రైతులు మరియు వ్యవసాయ కమ్యూనిటీ

"అగ్రివుమన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఛేంజ్ - ది ఫ్యూచర్ ఆఫ్ ఉమెన్నోమిక్స్" -మధ్యాహ్నం 2:00 – పురుష వ్యవస్థాపకులు

"అగ్రివుమన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఛేంజ్ - ది ఫ్యూచర్ ఆఫ్ ఉమెన్నోమిక్స్"-4:00 PM - మహిళా వ్యవస్థాపకులు

ఇతర వెబినార్ లు/లైవ్ సెషన్:

"వ్యవసాయంలో మహిళల పాత్ర"- ఉదయం 9:00 నుంచి-10 ప్రాంతీయ భాషలు

Related Topics

internationalwomenday

Share your comments

Subscribe Magazine