Animal Husbandry

జంతువుల నుంచి జంతువులకు వ్యాపించే కరోనా.. కేవలం మనుషులు నుంచే వ్యాప్తి!

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా వైరస్ వివిధ రూపాలను మార్చుకుంటూ తీవ్రరూపం దాలుస్తోంది.ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రతి రోజు ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. కరోనా వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తిచెందుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే.అందుకోసమే ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా తగినన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

తాజాగా ఈ కరోనా బారిన పడిన యజమానులకు చెందిన పెంపుడు కుక్కలలో కూడా సార్స్‌ 2 కొవిడ్‌-19 వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని యూరోపియన్ క్లినికల్ మైక్రోబయాలజీ బృందం ఈ ఏడాది చేసిన పరిశోధనల ద్వారా వెల్లడించింది. అదేవిధంగా నెదర్లాండ్స్‌కు  చెందిన ఉట్రెక్ట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం కరోనా సోకిన 196 మంది యజమానుల పిల్లల్లో నుంచి 156 పెంపుడు కుక్కలు,154 పిల్లుల నుంచి రక్తనమూనాలను గొంతులో నుంచి స్వాబ్‌ను సేకరించారు. ఈ స్వాబ్‌ను పీసీఆర్‌, రక్తనమూనాలకు యాంటీ బాడీ టెస్టులు నిర్వహించారు.

ఈ పరీక్షలలో 4.2 శాతం పీసీఆర్‌ టెస్టులలో పాజిటివ్ రాగా,17.4 శాతం రక్తంలో యాంటీబాడీలు కనిపించాయి. ఆ తర్వాత మరోసారి 11 జంతువులకు పరీక్షలు చేసినప్పుడు వాటిలోనూ యాంటీబాడీలు కనిపించడంతో వీటికి కరోనా సోకి నయమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు.అదేవిధంగా ఈ జంతువులతో పాటు కలిసి ఉండే జంతువులకు పరీక్షలు నిర్వహించగా వాటిలో నెగిటివ్ నిర్ధారణ వచ్చింది.

ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కేవలం మనుషుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాప్తి చెందుతుంది. జంతువుల నుంచి జంతువులకు వ్యాప్తి చెందడం లేదని నిర్ధారించారు. అందుకోసమే మనకు కరోనా సోకిన కూడా పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More