Animal Husbandry

మీ సొంత పశు గ్రాసాన్ని పెంచుకోవడంలో మెళకువలు తెలుసుకోండి.

S Vinay
S Vinay

గేదె, ఆవు, మేకల వంటి పాడి జంతువులకి పశుగ్రాసం ముఖ్యమైన ఆహారం. వాటికి కావాల్సిన పోషకాలకి ముఖ్యమైన వనరు ఈ పశుగ్రాసమే.అయితే ఈ పశుగ్రాసాన్ని తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి వచ్చేలా మన పొలంలోనే పండించుకోవచ్చు. నాణ్యమైన పశుగ్రాసాన్ని పాడి జంతువులకి అందించడం ద్వారా పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అందులో వున్నా మెళకువలను తెలుసుకుందాం.

ఎలాంటి పశు గ్రాసాన్ని పెంచాలి:
పశువులకు మేలైన పోషణ అందివ్వడానికి మొక్కజొన్న,జొన్న,అలసందలు,హైబ్రిడ్ నాపియర్ (సజ్జలు),పిల్లిపెసర వంటి వాటిని పశు గ్రాసంగా పెంచుకోవాలి. ప్రధాన పొలం లోనే కాకుండా వీటిని పొలం గట్లపైన కూడా పెంచుకోవచ్చు. అయితే మనకున్న పొలాన్ని మరియు నీటి వసతులని బట్టి వీటిని ఎంపిక చేసుకోవాలి. వర్షపాతం, నీటి పారుదల ఎక్కువగా ఉంటే హైబ్రిడ్ నాపియర్ మరియు మొక్కజొన్నలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి లేకుంటే జొన్నలు, సజ్జలను ఎంచుకోవాలి.

విత్తన ఎంపిక:
పశుగ్రాస పంటల ఉత్పాదకతను పెంచడానికి విత్తన ఎంపిక అత్యంత కీలకమైన అంశం. రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి ధ్రువీకరణ పొందిన విత్తనాలను ఎంచుకోవడం ఉత్తమం.

ప్రధాన అంశాలు:
పశు గ్రాసాన్ని సాధారణ నేలల్లో కూడా పండించవచ్చు, వీటి నిర్వహణకు ఎరువులు రసాయనిక మందులు పెద్ద మొత్తంలో అవసరం లేదు కాబట్టి వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కువ.

విత్తనాలను విత్తినప్పుడు మరి లోతుగా కాకుండా 2 నుండి 3 సెం. మీ ల వరకు విత్తాలి. మొక్కలు ఎక్కువ వచ్చేలా దగ్గర దగ్గరగా విత్తుకోవాలి.

మొక్కలు 50 శాతం పూత దశలో ఉన్నప్పుడు పశు గ్రాసాన్ని కోసుకోవాలి. ఆలస్యం చేస్తే ఆకులు విషపూరితం అవుతాయి. జంతువుల ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

మొక్కలు 50 శాతం పూత దశలో ఉన్నప్పుడే కోత కోయడం వల్ల వీటి సాగులో పెద్దగా సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవాసం లేదు.

పశువులకి మేతని అందిచేటప్పుడు మూడు వంతులు పచ్చి గడ్డి పశు గ్రాసం మరియు ఒక వంతు పప్పు జాతికి చెందిన పశుగ్రాసాన్ని ఉండేట్లు చూసుకోవాలి తద్వారా పాల ఉత్పత్తి మరియు నాణ్యత పెరుగుతాయి.

మరిన్ని చదవండి:

రోజుకు 33. 8 లీటర్ల పాలు చరిత్ర సృష్టించిన గేదె !

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More