గత దశాబ్డా కాలంలో మాంశం వినియోగం ఎన్నో రేట్లు పెరిగింది. ప్రోటీన్లు మరియు పోషకాలు సంవృద్ధిగా ఉండటంతో కోడి మాంశం, మరియు గుడ్లకు డిమాండ్ చాలా రేట్లు పెరిగింది, దీనితో కోళ్లఫారాలు లాభసాటిగా మారాయి. ఫారం కోళ్లతోపాటు, దేశీయ నాటు కోళ్లకు కూడా గిరాకీ పెరగడంతో, చాలా మంది రైతులు వీటిని పెంచేందుకు ఆశక్తి చూపిస్తున్నారు. అయితే కోళ్లపెంపకంలో ఎన్నో ఆటుపోట్లు మరియు సవాళ్లు ఎదురవుతాయి. కోళ్లు తరచూ జబ్బుల భారిన పడి చనిపోవడంతో, కోళ్లను పెంచేవారు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
కోళ్లకు సోకె అనేకమైన వ్యాధుల్లో కొక్కెర తెగులు ఒకటి. దీనినే రాణిఖేత్ వ్యాధి అనికూడా పిలుస్తారు. ఈ వ్యాధి పరామిక్సో అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. వైరస్ ద్వారా వ్యాప్తి చెందే కాబట్టి వేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి తీవ్రత చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎదిగిన కోళ్లతోపాటు కోడి పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. వైరస్ ఉదృతి ఎక్కువుగా ఉంటే పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయే ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ, వ్యాధి సోకిన కోళ్లను గుర్తించి వాటికి అవసరమైన చికిత్సను అందించాలి.
కోళ్లకు కొక్కెర వ్యాధి సోకిందా? లేదా? అని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించిన వచ్చు. ఈ వ్యాధి సోకిన కోళ్లు పచ్చ రంగులో ఎక్కువ పారుతుండటం గమనించవచ్చు, దీనితోపాటు సాధారణం కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత నమోదవ్వడం, వంటివి ప్రధాన లక్షణాలు. ఇటువంటి సందర్భాల్లో కోళ్లు మేత తినడం పూర్తిగా మానేసి నీరసించిపోతాయి. దీనితోపాటు కళ్ళు మరియు పక్షవాతం వచ్చినట్లు వంకరగా మారిపోతాయి, అలాగే చర్మం కింద వాపులు కూడా ఏర్పడతాయి. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే మిగిలిన కోళ్లకు కూడా వ్యాధి వేగంగా వ్యాప్తి చెంది, భారీ ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటిది వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలు పాటించాలి.
కొక్కెర వ్యాధి వైరస్ వలన వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి దీనిని నివారించడానికి ఎటువంటి మందులు లేవు. ఈ వైరస్ తెగులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఫారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ఫారం చుట్టూ మందులను పిచికారీ చెయ్యాలి. కోళ్లకు క్రమం తప్పకుండా ఆర్డికే వాక్సిన్ టీకాలను వెయ్యించాలి. కోడిపిల్లకు లాసోటా వాక్సిన్ కంటి చుక్కల రూపంలో వెయ్యించడం ద్వారా కొక్కెర వ్యాధిని తట్టుకోగలిగే వ్యాధి నిరోధక శక్తీ లభిస్తుంది. వ్యాధి సోకిన కోళ్లను వేరు చేసి వాటికి యాంటిబయోటిక్ మందులను ఇవ్వడం ద్వారా వ్యాధిని నుండి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
Share your comments