Animal Husbandry

చిన్న వయసున్న పాడి రైతులు పాటించవలసిన జాగ్రత్తలు....

KJ Staff
KJ Staff

పశుపోషణ చేస్తున్న పాడిరైతులు, కాలానికి అనుగుణంగా ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా లేగదూడలు ఉన్న రైతులైతే మరింత అప్రమత్తంగా ఉండవల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేగదూడలును నిరంతరం పర్యవేక్షిస్తూ, వాటి ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అన్నిటిని అందించవల్సి ఉంటుంది. లేగదూడలును జాగ్రత్తగా పెంచితే అవి భవిష్యత్తులో మంచి ఆదాయం అందించేందుకు అవకాశం ఉంటుంది.లేగదూడల పెంపకంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లేగదూడలు పుట్టిన వెంటనే వాటికి, నోరు మరియు ముక్కు వద్ద ఉండే జిగట వంటి పదార్దాన్ని తొలగించాలి. ఈ జిగట వంటి పదార్ధం దూడలు గాలి తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి. దీనిని తొలగించడం ద్వారా వాటికి గాలి సక్రమంగా ఆడుతుంది. దీనితోపాటుగా దూడలు పుట్టిన వేంటనే అవయవాలు అన్ని సక్రమంగా ఏర్పడ్డాయో లేదో గమనించి, ఏమైనా అవయవలోపం కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్సలు అందించాలి.

దూడపుట్టిన వెంటనే బొడ్డు పేగును కత్తిరించవలసి ఉంటుంది, దీనికోసం పేగుకు రెండు అంగుళాల భాగాన్ని వదిలిపెట్టి మిగిలిన దానిని కత్తిరించాలి. కత్తరించిన భాగంలో అయోడిన్ లేదా డేటోల్ పుయ్యాలి, లేకపోతే బొడ్డు వాపు మరియు ఇతర వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువుగా ఉంటుంది. దూడ పుట్టిన కొన్ని గంటల వ్యవధిలో, దాని బరువు ఎంతుందో పరీక్షించాలి, ఉండవలసిన దానికంటే తక్కువ బరువు ఉంటే వెంటనే అవసరమైన చికిత్స అందించాలి. అప్పుడే పుట్టిన లేగదూడలు జున్నుపాలు తాగేలా చెయ్యడం చాలా ముఖ్యం. బలహీనగంగా పుట్టిన బలం చేకూరడానికి జున్ను పాలు ఎంతో అవసరం. జున్నుపాలులో అనేక రకాల పోషకవిలువలు ఉంటాయి.

అప్పుడే పుట్టిన లేగదూడకు విటమిన్- ఎ, డి, ఈ మరియు ఐరన్ వంటి పోషకాలను ఇంజెక్టన్లు లేదంటే నోటి ద్వారా అందించాలి. వీటిని అందించడం ద్వారా దూడలకు చిన్న వయసులో వచ్చే అనేక రకమైన రోగాలు మరియు ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడేందుకు వీలుంటుంది. వీటితోపాటుగా దూడ పుట్టిన పదిరోజుల లోపు కొన్ని రకాల వాక్సిన్లు అందించాలి. మొదటిరోజు ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజక్షన్ వేయించాలి. విరోచనాలు రాకుండా రెండవ రోజు, విటమిన్- బి, టెట్రాసైక్లిన్ యాంటిబయోటిక్ బిళ్ళలు లేదంటే పౌడర్ తాగించాలి. దీనితోపాటు 7వ రోజు ఎలికపాములు రాకుండా ఉండేదుకు హైపర్ జిన్ అడిపేట్, అల్బెన్దోజోల్, వంటి మందులను అందించాలి. ఈ విధంగా అన్ని రకాల జాగర్తలు పాటిస్తే, ఇవి పెరిగి పెద్దవై, మేలు జాతి ఆవులుగా మారి రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడతాయి.

Share your comments

Subscribe Magazine