పౌల్ట్రీలో వ్యవసాయంలో ఖనిజ పదార్ధాలు ఆహారంలో అతి తక్కువ మాత్రలో ఇవ్వబడినప్పుడు అయినా, వాటి ఎదుగుదలలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. NRC (1994) ద్వారా ఈ ఖనిజ పదార్ధాలను ఆహారంలో ఏ మాత్రలో కలపాలని సిఫార్సు చేయబడింది. (జింక్, మాంగనీస్, కాపర్, ఐరన్, సెలీనియం, అయెడిన్) ఆహారంలో ఫ్రీ మిక్స్ గా ఇవ్వబడును. వీటియొక్క మాత్ర mg/ppmలో ఇస్తారు. గుడ్ల నిర్మాణంలో, గుడ్డుయొక్క పెంకు నిర్మాణంలో జింక్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మరియు కొన్ని ఎంజైములలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.ఇది కోళ్ల యొక్క రోగనిరోధక శక్తి వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.
కాపర్ ఖనిజ పదార్ధం కూడా అనేక ఎంజైముల పనితీరును నియంత్రిస్తుంది. మాంగనీస్ పరోక్షంగా ఐరన్ మాత్రను నియంత్రిస్తూ ఎర్రరక్తకణాల నిర్మాణాల్లో సహాయ పడుతుంది. ఐరన్ హిమొగ్లోబిన్ మరియు కండరాల ప్రోటీన్ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మాంగనీస్ మ్యూకోపాలీసాకరైట్ నిర్మాణంలో సహాయపడుతుంది. ఈ మ్యూకోపాలీసాకిరైట్ ఎముక కార్టిలేజ్ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించబడుతుంది. ఈ పైన తెలిపిన ఖనిజ పదార్ధాల లోపం మూలంగా మరియు వాంఛనీయ మాత్ర కన్న అధికంగా ఇవ్వబడునప్పుడు కూడా కోళ్ల శరీక ప్రక్రియను ప్రతికూలంగా ప్రభావిస్తుంది. ఈ వ్యాసంలో ట్రేస్ మినరల్స్ సెలీనియం పాత్ర మరియు కోళ్ళలో దానియొక్క ప్రయోజనం వివరించబడింది.
అధిక సెలీనియం లోపం ఆధునిక పౌల్ట్రీ పరిశ్రమలో సంభవించి ఉపశీర్షిక స్థాయిల కారణంగా ఉత్పాదకత మరియు పునరుత్పత్తి పనితీరును తగ్గించి ఒత్తిడి పరిస్థితులో యాంటిఆక్సిడెంట్స్ యొక్క రక్షణనిస్తుంది. ఆధునిక జన్యుశాస్త్రం కోళ్ళ అభివ్రుద్దిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. అయితే పనితీరులో ఇటువంటి మెరుగుదలల యొక్క ప్రధాన ప్రతికూలత ఏమిటంటే కోళ్ళు తరచు వివిధ ఒత్తిళ్ళకు గురి అవుతాయి. కాబట్టి ఆధునిక మరియు వ్యాపారం సంబందించి పౌల్ట్రీ ఉత్పత్తిలో సెలీనీయం ఖనిజ పదార్ధాలతో కలిసి కోళ్ళ యొక్క ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.
సెలీనీయం యొక్క మూలాలు:
వాస్తవానికి జంతువులలో అవి తినే మొక్కలు లేదా ధాన్యాలలో సెలీనీయం కలిగి ఉంటుంది. సెలీనీయం మొక్కలకు అవసరమైన మూలకం కాదు. శిలీంద్రాలు అనగా ఈస్ట్ (yeast)తో సహా మట్టిలో ఉన్న సెలీనీయం యొక్క ఖనిజ రూపాలను ప్రధానంగా సెలీనోమిథియొనిన్ మరియు మిథైలో సిస్టిన్ వివిధ సేంద్రీయ రూపాల్లోకి మార్చగలవు. మొక్కల యొక్క సెలీనియం కంటెంట్ చాలా వరకు మారుతూనే ఉంటుంది. ఇది నేల యొక్క మట్టి మరియు నీరు నుంచి లభ్యమైన సెలీనియం పైన ఆధారపడి ఉంటుంది. ధాన్యాలలో అనగా సోయా మరియు నూనె గింజలలో సెలీనియం సెలీనోమిథియోనిన్ రూపంలో లభిస్తుంది. క్రమం తప్పకుండా ఆహారంలో సెలీనియం ఇవ్వవలసి ఉంటుంది. పశువుల పోషణలో సెలీనియం యొక్క ఫీడ్ మూలాలు రెండు విధాలుగా విభజించబడ్డాయి.
- ఇన్ ఆర్గానిక్ సెలీనియం
- ఆర్గానిక్ సెలీనియం
-
ముద్ద చర్మం రోగము – మన సంప్రదాయ వైద్యము!
విభిన్న ఖనిజ పదార్ధాల ద్వారా పక్షుల పరిపక్వత మెరుగు పరుస్తుంది. ఆర్గానిక్ సెలీనియం కోళ్ళలో అన్ని పెరుగుదల స్థాయిలలో చేరి ఉత్పత్తి సంభందించి పారామితుల వ్రుద్ధి చెందడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలో మరియు ఆరోగ్యంలో, రోగనిరోధక శక్తిలో, మాంసం నాణ్యతపై కూడా ఆర్గానిక్ సెలీనియం సానుకూల ప్రభావం చూపుతుంది.
పక్షులకి సెలీనియం ఆర్గానిక్ మరియు ఇన్ ఆర్గానిక్ ఏరూపంలో అయినా సరియైన మాత్రలో ఇవ్వనప్పుడు ప్రతికూల ప్రభావాలు కనబడుతాయి. కోళ్ళు గుడ్లు ఇచ్చే సమయంలో ఒత్తిడికి గురి అవుతాయి. గుడ్లు పెట్టె సమయంలో సెలీనియం ఆహారంలో ఇచ్చినప్పుడు గడ్లయొక్క నాణ్యత మరియు ఉత్పత్తి పెరుగుతుంది మరియు మాంసంలో సంగ్రహించబడుతుంది.
మరియు మాంసం యొక్క నాణ్యత పెరుగుతుంది. గుడ్లలో సెలీనియం సంగ్రమం అయినప్పుడు పిండం ఎదుగుదలలో సహాయ పడుతుంది. ఎందుకంటే ఈ ఖనిజ పదార్ధం యాంటిఆక్సిడెంట్స్ మాత్రని పెంచుతుంది. గుడ్లు పొదిగే సమయంలో కోడిపిల్లలు ఒత్తిడికి గురి అవుతాయి. ఆ సమయంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. కోళ్ళలో ఒత్తిడి సమయంలో సమయంలో, శరీర ఎదుగుదల సమయంలో సెలీనియం నుంచి సెలినోఫ్రొటీన్ల నిర్మాణం జరిగి జన్యు నియంత్రణలో ఉంటుంది.
సహజమైన రోగనిరోదక శక్తి లేదా నిర్ధిష్టమైన రోగనిరోదక శక్తి కోళ్ళు జన్మించిన వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. కోళ్ళలో విటమిన్ E మరియు సెలీనియం రెండింటిని కలిపి ఇస్తారు. ఇలా ఆహారంలో ఇచ్చినప్పుడు మాక్రోఫేజ్ సంఖ్యలు (రోగనిరోధక కణం) మరియు వాటి ఫాగోసైటిక్ సంభావ్యత క్రియ పెరుగుతుంది. వాణిజ్య బ్రాయిలర్స్ పెంపకం మూలంగా వాటి శరీర భారాన్ని తక్కువ సమయంలో సామాన్య కోళ్ళ కంటే ఎక్కువ భారం పొందుతాయి.
కోళ్ళల్లో రోగ నిరోధక శక్తి సమస్యలు అనగా ఈకలు ఎక్కువగా రాలడం, పాంటింగ్ క్రియ వంటి సమస్యలు పెరుగుతాయి. ఉత్పాదకత తగ్గుతుంది. పాంటింగ్ క్రియ ఎక్కువ పెరిగినప్పుడు కోళ్ళ ఆరోగ్యం సరిలేదని తెలియపరుస్తుంది. దీనివల్ల శ్వాసకోష సమస్యలు ఏర్పడి మరణాలు సంభవించవచ్చు. ఆహారంలో వేరే పోషకతత్వాలు ఉన్నప్పుడు సెలీనియం ద్వారా వాటి క్రియ కూడా ప్రభావితం అవుతుంది.
Lumpy Skin Disease: తెలంగాణాలోను లంపి చర్మ వ్యాధి ..
ఆర్గానిక్ సెలీనియం:
ఆహార పదార్ధాలలో సహజంగా లభించే సెలీనియం మెథియోనిన్, సెలెనైట్ కంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కోడి నుంచి గుడ్డుకి బదిలీ అయిన సెలీనియం అభివ్రుద్ధి చెందుతున్న పిండానికి బలమైన యాంటీఆక్సిడెంట్ రక్షణను అందిస్తుంది కోళ్ళల్లో (బ్రీడర్స్) లో సెలీనియం ఉండిన పోషన మూలంగా కొత్తగా పోదిగిన కోడిపిల్లల అభివ్రుద్ధిని మెరుగుపరుస్తుంది. సోడియం సెలెనైట్ కంటే సెలెనోథియోనిన్ ఆర్గానిక్ రూపంలో ఆహారంలో ఇచ్చినప్పుడు అన్ని రకాల ఒత్తిళ్ళని తగ్గిస్తుంది.
ఆర్గానిక్ సెలీనియం నిక్షేపణ గుర్తించి కోడి పిండాల కాలేయంలో గ్లూటాతియోన్ పెరాక్సిడేన్ అనే ఎంజైమ్ చర్య పెరిగి, అన్ని రకాల ఒత్తిళ్ళ పరిస్థితులలో పక్షి యొక్క యాంటి ఆక్సిడెంట్ చర్యని పెంచుతుంది. పక్షలు ఒత్తిళ్ళకి గురి అయినప్పుడు శరీరంలో ఆక్సీజన్ ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి జరుగుతుంది. సాధారణంగా ఈ ఫ్రీరాడికల్స్ పక్షిని బయట క్రియల సంక్రమణ నుండి రక్షిస్తాయి. కాని దాని ఉత్పత్తి అవసరం కంటె ఎక్కువ అయినప్పుడు అవి శరీరానికి హాని కలిగిస్తుంది. కొన్ని తెల్ల రక్త కణాలు మిగిలిన రాడికల్స్ ని నివారిస్తాయి. శరీరంలో సెలీనియంలో ఏర్పడిన సెలీనోఫ్రోటీన్స్ విష ప్రభావాన్ని తగ్గిస్తాయి. సెలీనియం కూడా గుడ్డు పెంకు నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని కోళ్ళలో చూపుతుంది. శరీర బరువు, గుడ్డు నాణ్యత, హాగ్ యూనిట్, సంతానోత్పత్తి మరియు పొదుగుదల శాతం, పచ్చపొన మరియు అల్బుమెన్ లో సెలీనియం మాత్ర ద్వారా వాటి పెరుగుదలపైన అభివ్రుద్ధి చూపుతుంది.
వాణిజ్య బ్రాయిలర్ పెంపకం మూలంగా వాటి శరీర భారాన్ని తక్కువ సమయంలో సామాన్య కోళ్ళకంటే ఎక్కువ శరీర భారం పొందుతారు. దీని మూలంగా వాటిలో ఒత్తిడి పెరిగి ROS ఫ్రీరాడికల్స్ కారకాలు పెరుగుతాయి. ROSను ఉత్పత్తిని చేసే మరో ముఖ్యమైన కణం హెటిరోఫిల్స్ మరియు రక్తంలో ఫాగోసైట్ క్రియ పెరిగి బ్రాయిలర్ లలో శరీరక్రియ లోపాలు కలిగే శక్తిని తగ్గిస్తుంది. పైన తెలిపిన పదార్ధాలు శ్లేష్మంలో lgA మాత్ర నిరంత్రణ ద్వారా ప్రో-ఇన్ ప్లమేటరీ సైటోకిన్ల మాత్రను అనుకూలంగా పెంచుతుంది. దీనిమూలంగా పక్షిని వ్యాధికారకాల నుంచి రక్షస్తుంది.
రోగనిరోధక రక్షణకు కోళ్ళకు టీకాలు చాలా అవసరం. సాధారణంగా కోళ్ళల్లో సెలీనియం లోపం మనం తొందరగా కనుక్కోలేము. దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షియిస్ బర్సల్ డిసీజ్ వైరస్ వ్యాక్సిన్ ల ద్వారా ప్రతిరోధకాలను ప్రేరేపించడంపై డైటరీ సెలీనియం సప్లిమెంటేషన్ యొక్క ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని పరిశోధనా పరిణామాలు ఏమి తెలియపరిచాయంటే ఆర్గానిక్ సెలీనియం యొక్క వివిధ సాంద్రతలు (0, 100, 200, 300 లేదా 400 ug/kg (microgram) ఆహారం) యొక్క ఫీడ్ సప్లిమెంట్ చేసినప్పుడు బ్రాయిలర్ లలో రోగనిరోధక శక్తిని ప్రభావించినట్టు పరిణామాలు కనిపించలేదు అందువల్ల దీనికన్న ఎక్కువ మాత్ర ఇవ్వాలని సలహా ఇచ్చారు. కొన్ని పరిశోధనల ఫలితాలు ఏమి తెలియపరచాయంటే 100-400mg/kg ఆహారంలో ఇచ్చినప్పుడు దీని ప్రభావం చూపలేదు.
దీని అర్ధము సెలీనియం ప్రభావం ఉండదని కాదు అది ఒక జీవి యొక్క వయస్సు శరీర భారం, లింగము మీద స్థిరపడి ఉంటుంది.కొన్ని పరిశోదనా పరిణామాలు ఏమి తెలియపరిచాయంటే 100-400 mg/kg సెలీనియం ఏకాగ్రత తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న కోళ్ళ రక్తంలో తెల్లరక్త కణాల ఎపిటోప్స్ CD3+CD8+T సెల్ ఫ్రిక్వెన్సీలను తగ్గిస్తుంది. మరియు T కణాల పౌన:పున్యాలు కొద్దిగా తగ్గుతాయి.
Lumpy Skin Disease: తెలంగాణాలోను లంపి చర్మ వ్యాధి ..
ఇన్ ఆర్గానిక్ సెలీనియం:
సెలెనైట్ లేదా సెలానేట్ రూపంలో సెలీనియం భర్తీని FDA ఆమోదించింది. అప్పటి నుండి ఇనార్గానిక్ రూపంలో సెలీనియం పక్షి ఆహారంలో ఇస్తున్నారు. ఇనార్గానిక్ రూపంలో ఉన్న సెలీనియం విసర్జించ బడుతుంది. ఇనార్గానిక్ సెలీనియం కోళ్ళల్లో తల్లి నుంచి గుడ్డుకు వాంఛనీయ మాత్రలో లభించదు. ఇందుమూలంగా యాంటీ ఆక్సిడెంట్ లు పరిమితం అవుతాయి. ఇందుమూలంగా గుడ్డులో పెరిగే పిండానికి సెలీనియం అనుకూల మాత్రలో లభించదు మరియు పిండం పెరుగుదలకు ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రతికూలతలు అనగా శరీర బరువు, ఆరోగ్యం మరియు గుడ్ల యొక్క నాణ్యత, వివిధ కాలేయాలు, రొమ్ము మరియు కోళ్ళ యొక్క కాళ్ళ కండరాలలో అనుకూల మాత్రలో సెలీనియం లభించినపుడు కోళ్ళ అభివ్రుద్దిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
సెలీనోమెథియోనిన్ అనేది మానవ మరియు జంతువుల ఆహారంలో సహాజమైనది. ఒక్కసారి తీసుకున్న తర్వాత అది జీర్ణవ్యవస్థలో ఉండే మెథియోనిన్ ట్రాన్స్ పోటర్టర్ల ద్వారా గమనించబడుతుదంది. మరియు శరీరంలో మెథియోనిన్ సెలినీయంని సేకరిస్తుంది. పక్షులలో సెలీనియం ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. కోళ్ళల్లో కండరాల బలహీనత చాలా అరుదుగా కనిపిస్తుంది. తగినంత సెలీనియం ఆహారంలో తీసుకొని కారణంగా లోపం లక్షణాలకు దారి తీస్తుంది.
జన్మించినప్పుడు ఉన్న రోగనిరోధక శక్తిని Innate Immunity అని అంటారు. బ్రాయిలర్స్ లో ఈ విషయం పైన పరిశోధన జరిగింది. ఆహారంలో ఖనిజ పదార్ధాల లోపం మూలంగా పక్షి శరీరం వ్యాధికారకాలకు గురి అవుతుంది. సాధారణంగా టీకాలు ఇవ్వటం వల్ల హానికరమైన సూక్ష్మజీవులకు ప్రతికూలంగా పని చేస్తాయి. ఉదాహారణకి కోళ్ళ ఆహారంలో సెలీనియం యొక్క మాత్ర సరిగ్గా IBD ఉన్నప్పుడు వైరస్ లాంటి సూక్ష్మజీవుల క్రియాశీలతని తగ్గిస్తుంది. లేదా వాటి నివారణలో సహాయపడుతుంది.
సెలీనియం సప్లిమెంటేషన్ ద్వారా కొన్ని పరశోధనా పరిణామాలు తెలియపరిచాయంటే గుడ్డు ఉత్పత్తి శాతం, గుడ్డు బరువు, గుడ్డు నాణ్యత, శుక్రాణం శాతం, వీర్యం యొక్క మాత్ర పెంచడంలో సహాయపడుతుంది. సామాన్యంకంటే పుంజు యొక్క పరిపక్వత తొందరగా జరుగుతుంది. కోడిపిల్లలకు సెలీనియం ఆహారంలో ఇచ్చినప్పుడు అది పుంజుగా పెరిగినప్పుడు వాటి శరీర బరువు పెరుగుతుంది. మగపక్షుల్లో కూడా కండరాలలో సెలీనియం చేరి వీటిలో కూడా శరీర భారాన్ని పెంచడంలో సహాయ పడుతుంది.
ఈ వ్యాసం రాసిన రచయిత ద్వారా ఆర్గానిక్ సెలీనియంతో కోళ్ళల్లో పనిచేయగా ఏమి తెలిసిందంటే మామూలుగా 0.3ppm సెలీనియం కంటే ఎక్కువ మాత్ర ఇచ్చినప్పుడు (0.6 ppm) మా సంస్థానంలో ఉన్న నాటుకోడి జాతుల్లో గుడ్ల ఉత్పత్తి పెరిగింది మరియు బ్రాయిలర్ మూలం వనరాజ బ్రీడర్స్ లో శరీర భారం పెరిగింది. అందుకని కోళ్ళల్లో సెలీనియం మోతాదును ఆప్టిమైజ్ చేయడానికి భవిష్యత్తులోస్కోప్ ఉంది. వేరే పరిశోధన కార్యాలయాలలో కూడా తెలియపరిచారు.
Author
డా. ఎన్. ఆనందలక్ష్మి, శ్రీమతి ఎన్. దీపిక
డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రిసర్చ్
రాజేంద్రనగర్, హైదరాబాద్
Share your comments