Animal Husbandry

పశువుల్లో వచ్చే వ్యాధులు మరియు వాటి నివారణ చర్యలు

KJ Staff
KJ Staff

వేసవికాలం అలాగే రానున్న వర్ష కాలం పశుపోషకులు గడ్డు కాలంగా పరిగణించవచ్చు. వేసవికాలంలో పాడిరైతులకు పసుగ్రాశం లభించడం కష్టతరంగా మారుతుంది. ఈ కాలంలో పశువులకు సరిపడినంత ఆహరం దొరక్క, రోగనిరోధక శక్తీ తగ్గి, రోగాలకు గురయ్యే అవకాశం ఎక్కువ.

పశువులకు వ్యాధి సోకకముందే నివారణ చర్యలు పాటించడం ఆవశ్యకం. వ్యాధి సోకకుండా టీకాలు వేయించడం ద్వారా పాడి పశువులు రోగాలను తట్టుకుని నిలబడగలిగే సామర్ధ్యం సంతరించుకుంటాయి. వ్యాధి సోకినా పాల ఉత్పత్తి ఘనీయంగా తగ్గిపోతుంది. అయితే పశువుల్లో వచ్చే వ్యాధులు మరియు వాటి నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం.

బాబేసియోసిస్:

పశువులను పట్టి శరీరంపైనా చేరి రక్తాన్ని పీల్చే బాహ్యపరాన్నజీవులు పాడి పశువుల్లో కొన్ని రకాల రోగులను కూడా కలుగచేస్తాయి.దీనిలో బాబేసియోసిస్ ముఖ్యమైన వ్యాధి దీనినే రక్త మూత్ర వ్యాధి అనికూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఒక పశువు నుండి మరొక్క పశువుకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. పశువుల రక్తాన్ని పీల్చే గోమార్లు వంటివి ఈ వ్యాధిని వ్యాప్తి చెందేలా చేస్తాయి. ఈ వ్యాధి సోకినా పశువుల్లో శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది, ధానితోపాటుగా రక్తం విరిగి రక్త హీనత కలుగుతుంది, మూత్రవిసర్జన ద్వారా బయటకి వస్తుంది, అందువల్ల మూత్రం ఎరుపురంగులో రావడం గమనించవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యున్ని సంప్రదించి మందులు అందించాలి. ఈ వ్యాధి నివారణకు డైమినోజిన్, ఇమిడాకార్బ్ అనే మందు వ్యాధి నియంత్రించడంలో సహాయపడుతుంది. పశువులశాలలో గోమార్లు, పిడుదులు వంటి కీటకాలను నివారించడం ద్వారా వ్యాధి రాకుండా అరికట్టవచ్చు.

లాంఫీస్కిన్:

ఈ వ్యాధిని ముద్ద చర్మవ్యాధి అనికూడా పిలుస్తారు. లాంఫీస్కిన్ అంటువ్యాధి, ఒకపశువు నుండి మరొక్క పశువుకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి తెల్లజాతి అవ్వులో ఎక్కువుగా కనిపిస్తుంది. వ్యాధి సోకినా పశువుల శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది, శరీరాంత కురుపులు మరియు మచ్చలు ఏర్పడటం గమనించవచ్చు. ముక్కునుండి మరియు కళ్ళ నుండి ద్రవం కారడం లాంఫీస్కిన్ వ్యాధి లక్షణాలు. వ్యాధి ముదిరితే పశువులు మరణించే అవకాశం ఉంటుంది, కనుక వ్యాధి సోకినా వెంటనే పశువులవైద్యుని సంప్రదించి చికిత్స అందించాలి. శరీరంపై ఏర్పడిన ఫుల్లుపై పురుగులు వాలకుండా వేపనూనెను వాడుకోవచ్చు. పశువులను ఆశించే బాహ్యపరాన్నజీవులు ఈ వ్యాధి వ్యాప్తికి కారణం, వీటిని నియంత్రించడానికి పశువులశాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

గాలికుంటూ వ్యాధి:

దీనినే "ఫుట్ అండ్ మౌత్" డిసీస్ అనికూడా పిలుస్తారు. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం పికార్ణవిరిడే అనే కుటుంబానికి చెందిని కొన్ని వైరస్ రకాలు. ఈ వ్యాధి సోకినా పశువుల్లో నోటిలో మరియు కాలి గిట్టేలోను ఫుల్లు ఏర్పడటం గమనించవచ్చు. ఈ వ్యాధి సోకినా పశువుల్లో పాల దిగుబడి అమాంతం పడిపోతుంది. ఈ వ్యాధి ప్రభలం అవ్వడానికి, వ్యాధి సోకినా పశువుల నుండి వచ్చే మూత్రం, మలం, పాలు, లేదా పశువులు వదిలే గాలినుండి కూడా వైరస్ మిగిలిన జంతువులకు సోకె ప్రమాదం ఉంది. వ్యాధి సోకినా నోటిలో మరియు నాలుక మీద పుళ్ళు ఏర్పడతాయి, అంతేకాకుండా కాలి గిట్టలపై పుళ్ళు ఏర్పడి చీము కారడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. అంతేకాకుండా వ్యాధి సోకినా పశువుల పొదుగు మీద కూడా పుళ్ళు ఏర్పడి పొడుగు వాపు వ్యాధి సోకే ప్రభావం ఉంటుంది. వ్యాధికి గురైన జంతువులను పశు వ్యాధులకు చూపించి, వ్యాధిని తగ్గించడానికి యాంటిబయోటిక్స్ ఉపయోగించాలి. నోటిపూళ్ళు తగ్గడానికి, నోటిని ఒక లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ పొటాషియం పేర్మన్గానేట్ కలిపి నోటిని శుభ్రంచేయ్యాలి, తర్వాత బోరోగ్లిసరిన్ మందును పుళ్ళ మీద రాయడం ద్వారా వీటిని నివారించవచ్చు. కాళ్ళ మీద ఏర్పడే పుళ్ళు పెరగకుండా వేప నూనెను రాయడం మంచిది.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More