ఆంధ్రప్రదేశ్ లో సుమారు రెండు లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం మిగిలిన 50 వేల హెక్టార్లలో ఉన్న ఉప్పు నీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో చూస్తే రొయ్యల సాగు సుమారు నాలుగు వేల హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఇంతకుముందు ఈ ఉప్పు నీటి చెరువులలో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టే వారు, కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్యపిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నందున,ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామీ రొయ్యలు పెంపకం చేపడుతున్నారు.
టైగర్ రొయ్యలతో పోలిస్తే వెన్నమిసాగులో చాలా ప్రత్యేకతల కలిగి ఉన్నాయి
- ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువ,
- అధిక సాంద్రతలో అంటే చదరపు మీటరుకు 60 నెంబర్ వరకు సాగు చేపట్టే వీలుంటుంది కనుక అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది.
- ఇంకా వివిధ రకాల సెలనిటీలలో (0 ppt నుండి 35 ppt) ఈ రొయ్యలను పెంచుకునే వీలుంటుంది
- నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు తట్టుకుంటాయి
- వన్నమి రొయ్యలకు తక్కువ ప్రోటీన్ ఉన్న మేతలను వాడుకునే అవకాశం ఉంది
- పంటకాలం కూడా చాలా తక్కువ అంటే 90 నుండి 125 రోజులలో పంట వస్తుంది
తక్కువ సమయంలో అధిక దిగుబడులు, అధిక రాబడిని పొందే వీలు ఉన్నప్పటికీ చెరువుల తయారీ విషయంలో అవగాహన పూర్తిగా లేకపోవడం, నాణ్యమైన విత్తనాలు లభించక పోవడం మేత ఆరోగ్య యాజమాన్యంలో అవగాహన లేకపోవడం, దీంతో పాటు ప్రస్తుత కాలంలో ఈ హెచ్ పి (E.H.P), వైట్ గట్, విబ్రియో వంటి వ్యాధుల ప్రభావం వలన రైతులు ఎక్కువగా నష్టాల బారిన పడుతున్నారు.
రొయ్యల పెంపకంలో నేల స్వభావం, మట్టి లక్షణాలు చాలా కీలకమైనవి. చెరువు నేల స్వభావం మీద మట్టికి నీటిని నిల్వ ఉంచే శక్తి, సరైన పోషకాల లభ్యత నేల, నీటి లక్షణాల లో ఏర్పడే మార్పులు ఆధారపడి ఉండి, చెరువు లో పెంచే రొయ్యల బ్రతుకుల పెరుగుదల పై ప్రభావం చూపిస్తాయి. సాగు సమయంలో నేలలోని పోషకాలు నీటిలోకి విడుదల అవటం జరుగుతుంది. వృధా అయిన మేతలు ఇతర సేంద్రియ పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం అవ్వడం, plankton అభివృద్ధికి పంట కాలంలో నీటి గుణాలు సమతాస్థితి లో ఉంచడానికి నేల లక్షణాలు కీలక పాత్రను పోషిస్తాయి. రొయ్యల పెంపకానికి నల్లరేగడి నేలలు ఒండ్రుతో కూడిన ఇసుక నేలలు(loam) వంటి నీటిని నిల్వ ఉంచి లక్షణాలు ఉన్న నేలలు అనుకూలమైనవి.
అందువల్ల రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన పంట కాలంలో వచ్చే చాల రకాల ఇబ్బందుల నుండి పంటను రక్షించుకోవచ్చును.
Share your comments