Animal Husbandry

రొయ్యల సాగుకు చెరువుల తయారీ ,ప్రమాణాలు:

KJ Staff
KJ Staff

రొయ్యల సాగుకు ముందు చెరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా చెరువు నుండి మేతలతోపాటు వాడే చెక్ ట్రేసు, ఎరిఎటర్లు ఇతర పనిముట్లు అన్నిటిని తొలగింఛి, వాటిపై కుళ్ళుతున్నపదార్దం, జీవులు గాని నత్త గుల్ల గానీ లేకుండా శుభ్రపరుచుకోవాలి

  • గత పంట తాలూకా నీటిని పూర్తిగా బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్న గవ్వలను నత్త గుళ్ళను పూర్తిగా ఏరి వేయాలి
  • సేంద్రీయ వ్యర్ద పదార్థాలు ఎక్కువగా చేరడం వలన నేల అడుగుభాగం నల్లగా తయారవుతుంది అందువల్ల ఈ నల్లని మట్టిని ఒకటి నుండి నాలుగు సెంటీమీటర్ల లోతు వరకు పూర్తిగా తీసేసి చెరువు నుండి దూరంగా వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ గట్ల పై వేయరాదు
  • తర్వాత చెరువులను 20 నుండి 30 రోజుల వరకు నేల పగుళ్ళు వచ్చే విధంగా బాగా ఎండబెట్టాలి ఈ విధంగా చేయడం వల్ల చాలా రకాల వ్యాధులను వ్యాపింప చేసే వాహకాల గుడ్లను చిన్న చిన్న చేప పిల్లలను చంపేయొచ్చు ఇంకా మిగిలివున్న సేంద్రియ వ్యర్ద పదార్ధాలు కూడా ఆక్సిడేషన్ జరిగే విషవాయువులు బయటకు విడుదల అయిపోతాయి
  • ఒకవేళ రైతులకు ఎండ గట్టుకునే సదుపాయం లేనట్లయితే, వీలైనంత వరకు నీటిని తీసేసి మిగిలిన నీటిలో 20 ppm మోతాదులో క్లోరినేషన్ చేసుకోవాలి తరువాత చనిపోయిన జీవాలను అన్నిటినీ ఏరి వేయాలి.
  • నీటి లోతు 15నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో కేజ్ వీల్స్ ఉన్న ట్రాక్టర్లతో దున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలావరకు హానికారక వాయువులు బయటికి విడుదల అయిపోతాయి ఇలా చేసిన తరువాత sludgeతో ఉన్న నీటిని బయటకు తోడేయాలి
  • ఈ విధంగా చెరువులను బాగా ఎండగట్టి దున్నిన తర్వాత మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసుకుని నెల గుణాలు అనుకూల స్థాయిలో ఉండేల చేసుకోవాలి

     రొయ్యల సాగుకు మట్టి గుణాలు ఏ విధంగా ఉండాలంటే  పీహెచ్ అంటే ఉదజని సూచి  6.5 నుండి 7.5  సేంద్రీయ కర్బనం 1.5 శాతం నుండి 2 శాతం నత్రజని వందగ్రాముల మట్టిలో 50 మిల్లీగ్రాముల నుండి 75 మిల్లీగ్రాముల భాస్వరం 100 గ్రాములు మూడు నుండి ఆరు మిల్లీగ్రాములు ఉండాలి కార్బన్ నైట్రోజన్ లో నిష్పత్తి 20 1న పత్తిలో ఉండేలా చూసుకోవాలి.

ఉప్పు నీటి రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపిక సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

  • పరీక్ష చేసిన మట్టి నమూనాలు పీహెచ్ విలువ 7 కన్నా తక్కువ ఉన్నట్లయితే సున్నాన్ని వాడి సరిచేసుకోవాలి నేల పీహెచ్ విలువ 5 నుండి 7 మధ్య ఉన్నట్లయితే వ్యవసాయ సున్నం ఒక టన్ను లేదా క్విక్ లైం 300 నుంచి 500 కేజీలు, పీహెచ్ విలువ 6 నుండి 6.5 మధ్య ఉంటే వ్యవసాయం సున్నం ఒకటి నుండి రెండు టన్నులు లేదా క్విక్ లైం  500 కేజీల నుండి ఒకటి టన్నుచొప్పున వాడుకోవాలి పీహెచ్ విలువ 5.5 నుండి 6 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 2 నుండి 3 టన్నులు  క్విక్ లైం ఒకటి నుండి  1.5 టన్నులు చొప్పున వాడుకోవాలి
  • మట్టి గుణాలను పరిశీలించినప్పుడు నత్రజని భాస్వరం సేంద్రీయ కర్బనం పరిమాణాలను మోతాదు తక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు సేంద్రియ రసాయన ఎరువులను వాడుకోవాలి.
  • సున్నం వాడిని వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు వాడరాదు కనీసం వారంపాటు విరామం పాటించడం మంచిది చెరువులో ఒక అడుగు మేర నీరు పెట్టిన తర్వాత ఎరువులను వాడినట్లయితే ప్లాంక్టన్ బాగా అభివృద్ధి చెందుతుంది

చెరువు లోనికి లేదా రిజర్వాయర్ చెరువు లోనికి నీరు పంపు చేసేటప్పుడు కలుషితం లేని వనరుల నుండి నీరు పెట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నీటిని పుంపు  చేసే టప్పుడు మూడు దశలలో 20, 40, 60 మేష్ ఉన్న  ఫిల్టర్ బ్యాగులతో వడగట్టి తోడుకోవడం వలన ఇతర జీవులు గాని వాటి లార్వాలను గాని చెరువు లోనికి రాకుండా ఆపుకోవచ్చు. ఈ ఫిల్టర్ బ్బాగ్స్ చెరువులోకి తోడే నీటి పరిమాణం బట్టి 4 నుండి 10 మీటర్లు పొడవుగా ఉండే ఫిల్టర్ బ్యాగులను  ఏర్పాటు చేసుకోవాలి.  ఈ ఫిల్టర్ బ్బాగ్స్ లో మిగిలిపోయిన వేస్ట్ ను చెరువులకు దూరంగా వేయాలి. వడగట్టి తోడుకున్న నీటిని రెండు మూడు రోజులపాటు అలా ఉంచడం వల్ల నీటిలో ఉన్న వ్యర్ధ పదార్ధాలు అడుగు భాగానికి చేరుకుని ఇంకా ఏమైనా గుడ్లు, సిస్టులు వంటివి ఉంటే హచ్  జరుగుతాయి. ఆ తర్వాత క్లోరినేషన్ ద్వారా 10 నుండి 20 పిపిఎం వరకు అంటే సుమారు హెక్టారుకు 250 నుండి 500 కేజీలు వరకూ బ్లీచింగ్ పౌడర్ వాడి శుద్ధి చేసుకోవాలి. నీటిలో క్లోరిన్ పోయేంతవరకు నాలుగు నుండి ఆరు రోజులపాటు నిల్వ ఉంచుకోవాలి. మిగిలి ఉన్న క్లోరిన్ తీసివేయడానికి ఎయిరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే రైతులు తప్పనిసరిగా రిజర్వాయరు చెరువులను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నీటి గుణాలను పరీక్షించుకుని నీటిలో క్లోరిన్ గానీ ఇతర వ్యాధి కారకాలు గానీ లేవని నిర్ధారించుకొని రిజిస్టర్ కాబడిన హచరీల  నుండి నాణ్యమైన రొయ్య పిల్లలను తీసుకుని స్టాక్ చేసుకోవాలి.

రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన రొయ్యల పై ఒత్తిడి తగ్గి ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగడానికి ఇంకా పంట కాలంలో నీటి గుణాల్లో మార్పులు ఏర్పడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.

 

Related Topics

Pond Prawns cultivation

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More