Animal Husbandry

తెలంగాణాలో కోళ్ల దాణా ధరల పెరుగుదల,కోళ్లఫారాలే కాకుండా పాడి పరిశ్రమ పై ప్రభావం.

S Vinay
S Vinay

పెరిగిన దాణా ఖర్చుల కారణంగా చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత వరి సేకరణ సంక్షోభం కూడా ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లెవీని జారీ చేయకపోవడంతో రైస్ మిల్లులు ధాన్యాన్ని గ్రైండ్ చేయడాం లేదు ఫలితంగా పౌల్ట్రీ ఫీడ్‌గా ఉపయోగించే బియ్యం ఊక ధర పెరిగింది.

లేయర్ కోళ్ల కోసం ఎక్కువగా ఉపయోగించే దాణా ప్రస్తుతంఒక కిలో రూ.16గా ఉంది.కోళ్ల పరిశ్రమ రంగం పంజాబ్ నుండి గోధుమ రవ్వను మరియు ఇతర రాష్ట్రాల నుండి ముఖ్యంగా పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుండి వరి ఊకను కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలోని లేయర్ కోళ్లు సుమారుగా నాలుగు కోట్లు ఇది బ్రాయిలర్ కోళ్ల కంటే చాలా ఎక్కువ. పౌల్ట్రీ దాణా ఎక్కువగా ఊకబియ్యం ,సోయా ప్రోటీన్ మరియు మొక్కజొన్న వంటి వాటితో తయారుచేయబడుతుంది.

రైస్ బ్రాన్ ప్రోటీన్ శాతం ఆధారంగా వివిధ రకాలుగా దాణాగా ఉపయోగించబడుతుంది.18 శాతము ప్రోటీన్ ఉన్న దాణా కన్నా 14 శాతం ప్రోటీన్ వున్నది చాల చౌక అయినది కానీ ప్రస్తుత పరిస్థితిలో ఇది దొరకడం చాలా కష్టం అని పశుసంవర్ధక శాఖలోని ఒక సీనియర్ అధికారి వివరించారు.దాణా కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని కోళ్లఫారా యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల పరిశ్రమ మాత్రమే కాదు పాడి పరిశ్రమదీని ప్రభావానికి గురి కావాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, మార్కెట్‌లో గుడ్డు ధరలు పడిపోవడం వల్ల పౌల్ట్రీ వ్యాపారం గణనీయంగా నష్టపోయిందని శ్రీ ముకుంద రెడ్డి సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న, వరి మరియు విరిగిన బియ్యంపై సబ్సిడీలను అందిస్తే, దాణా ఉత్పత్తి ఖర్చును తగ్గించవచ్చు అని కోళ్లఫారా యజమానులు వ్యక్థమ చేస్తున్నారు.


మరిన్ని చదవండి.

మీ సొంత పశు గ్రాసాన్ని పెంచుకోవడంలో మెళకువలు తెలుసుకోండి.

Share your comments

Subscribe Magazine