Animal Husbandry

పశువులకు ఆదివారం సెలవు ..100 ఏళ్ల సంప్రదాయం.. ఎక్కడంటే?

Gokavarapu siva
Gokavarapu siva

మనుషులు వారం అంతట పని చేసి ఆదివారమో లేదా వారంలో ఏదో ఒక రోజు విశ్రాంతి తీసుకుతుంటారు. ఈ విశ్రాంతి అనేది మనుషులకు చాలా ముఖ్యంగా భావిస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ప్రదేశంలో ఐతే మనుషులతో పాటు పశువులకు కూడా సెలవు ఉంటుంది. మనలాగే వాటికి కూడా విశ్రాంతి అనేది ముఖ్యమని అక్కడ ప్రజలు భావిస్తారు. సుమారుగా అక్కడ ఈ సంప్రదాయం అనేది 100 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తుంది.

ఈ సంప్రదాయం అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో మనుషులలాగే పశువులకు కూడా వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. ఇక్కడ పశువులకు ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. ఆ సెలవు రోజున అక్కడ ప్రజలు పశువులతో ఎం పని చేయించారు. ఆ రోజు వాటి నుండి పాలను కూడా సేకరించారు. కేవలం పశువులకు ఆహారంగా మేతను మాత్రమే ఇస్తారు. అక్కడ ప్రజలు మనలాగే పశువులకు కూడా విశ్రాంతి ముఖ్యమని భావిస్తారు.

ప్రపంచంలో ప్రతి కార్యాలయాల్లో, కళాశాలల్లో మరియు ప్రైవేట్ సంస్థల్లో అయిన వారానికి ఒకరోజు సెలవు ఉంటుంది. ఇలా సెలవు ఇవ్వడం ద్వారా వారు శారీరకంగా మరియు మానసికంగా దృడంగా ఉండటానికి సహాయపడుతుంది. దీని ద్వారా సెలవు తరువాత మనుషులు అధిక శక్తితో పని చేస్తారు. ఈ విశ్రాంతి అనేది కేవలం మనుషులకే కాకుండా పశువులకు కూడా ఉండాలని జార్ఖండ్ ప్రాంతంలో వారి పూర్వికులు ఈ సంప్రదాయాన్ని అమలు చేస్తూ వచ్చారు.

ఇది కూడా చదవండి..

సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వం..ఏ పథకం డబ్బులు ఎప్పుడంటే?

జార్ఖండ్ కు చెందిన లతేహర్ జిల్లాలో ఈ సంప్రదాయం ఉంది. సుమారుగా ఏ జిల్లాకు చెందిన 20 గ్రామాల్లోని ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఆదివారం అక్కడ ప్రజలు పశువులతో ఎటువంటి పని చేయించారు. వాటికి పూర్తి విశ్రాంతిని ఆ రోజు కల్పిస్తారు. జిల్లాలోని హర్ఖా, మోంగర్, పరార్, లాల్‌గాడి సహా 20 గ్రామాల ప్రజలు తమ పశువులతో ఆదివారం పని చేయరు. వాటికి విశ్రాంతి ఇచ్చి తనటానికి పచ్చగడ్డి, మేతను ఆహారంగా వేస్తారు.

ఇక్కడ ప్రజలు ఇలా చేయడానికి గల కారణం వచ్చేసి, అక్కడ తమ పూర్వికులు పొలంలో దున్నుతుంటే ఒక ఎద్దు చనిపోయింది. ఆ ఎద్దు విశ్రాంతి లేకుండా ఎక్కువ పాన్ చేయడం ద్వారా చనిపోయింది అని తేలింది. అప్పటి నుండి అక్కడ గ్రామస్థులు పశువులకు కూడా ఒకరోజు విశ్రాంతి అందాలని నిర్ణయించుకున్నారు. కావున ప్రతి ఆదివారం ఇక్కడ పశువులకు సెలవు ఉంటుంది.

100 సంవత్సరాల నుండి తమ పూర్వికులు పెట్టిన ఈ సంప్రదాయాన్ని ఇక్కడ ప్రజలు ఇప్పటికి పాటిస్తున్నారు. పశువులకు వారంలో ఒకరోజు సెలవు ఇస్తే వాటికి అలసట తగ్గుతుందని అక్కడ ప్రజలు చెబుతున్నారు. మనుషుల్లాగే పశువులకు కూడా విశ్రాంతి అవసరమని గ్రామస్తులు అంటున్నారు.

ఇది కూడా చదవండి..

సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వం..ఏ పథకం డబ్బులు ఎప్పుడంటే?

Related Topics

cows Holidays

Share your comments

Subscribe Magazine