Government Schemes

సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వం..ఏ పథకం డబ్బులు ఎప్పుడంటే?

Gokavarapu siva
Gokavarapu siva

ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వీటితోపాటు రైతులను ఆర్ధికంగా ఆదుకోవడానికి వారికీ వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుంది. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను ఆర్బికే ల ద్వారా రైతులకు పంపిణి చేస్తుంది. అలంటి ఈ పథకాలను ఏ సమయంలో ప్రజలకు అందుతాయో తెలీదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24 సంవత్సరానికి సంబంధించి సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు మరియు వాటికి కేటాయించిన నిధుల క్యాలెండరును ఆవిష్కరించారు. ఇప్పటివరకు ప్రజలకు ఈ సంక్షేమ పధకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలను అందించారు.

ఏప్రిల్‌ 2023 - జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం
మే 2023 - వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన(మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా
జూన్‌ 2023 - జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జులై 2023 - జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీ తోఫా (రెండో త్రైమాసికం)

ఇది కూడా చదవండి..

అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణాలు మరియు నివారణ..

ఆగష్టు 2023 - జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర
సెప్టెంబర్‌ 2023 - వైఎస్సార్‌ చేయూత
అక్టోబర్‌ 2023 - వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ (రెండో విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)
నవంబర్‌ 2023 - వైఎస్సార్‌ సున్నావడ్డీ - పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడో విడత)
డిసెంబర్‌ 2023 - జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జనవరి 2024 - వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత),వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)
ఫిబ్రవరి 2024 - జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షా దీతోఫా (నాలుగో త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం
మార్చి 2024 - జగనన్న వసతి దీవెన (రెండవ విడత)

ఇది కూడా చదవండి..

అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణాలు మరియు నివారణ..

Related Topics

andhara pradesh schemes

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More