Animal Husbandry

ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ప్రభావాలు.

KJ Staff
KJ Staff

సాధారణంగా జంతువులు బిడ్డ పుట్టిన కొన్ని నెలలు లేదా సంవత్సరాల వరకు పాలు ఇస్తాయి. అయితే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం కోసం చాలామంది ఆవులు, గేదెల్లో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తుంటారు.

ఈ హార్మోన్ ని సాధారణంగా అన్ని క్షీరదాలు ఉత్పత్తి చేస్తాయి. పిట్యుటరీ గ్రంథిలో ఇది ఉత్పత్తి అవుతుంది. అయితే దీన్ని బయట నుంచి ఇవ్వడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయి. పాలు ఉత్పత్తి చేసే గ్రంథుల చుట్టూ ఉన్న కణాలు సంకోచ వ్యాకోచాలు చెందడం వల్ల పాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా అయితే పిల్లలు పుట్టడంలో ఈ హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. కడుపులోని బిడ్డను అక్కడున్న కండరాలన్నీ బయటకు తోసేందుకు ఈ హార్మోన్ తోడ్పడుతుంది.

అయితే కొందరు రైతులు తెలిసి తెలియక వీటిని ఆవులు, గేదెల్లో పాలు ఎక్కువగా వచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. వీటిని ఇంజెక్షన్ రూపంలో రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు అందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పాలు ఎక్కువగా వస్తుంటాయి. పాలు ఎక్కువగా వస్తాయి కదా అని వీటిని తరచూ వాడుతుంటారు. వీటిని ఎలాంటి ప్రిస్కిప్షన్ అవసరం లేకుండా అమ్మడం కూడా వీటి విచ్చలవిడి ఉపయోగానికి కారణం అవుతోంది.

కానీ దీని వల్ల పశువులకు ఎంత నష్టం అన్న విషయం రైతులు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల పశువుల్లో కలుగుతున్న ప్రభావాలను గమనించిన ప్రభుత్వం దీన్ని అత్యవసరం అయితే కానీ ఉపయోగించకూడదని నిబంధన విధించినా క్షేత్ర స్థాయిలో అది పెద్దగా అమలు అవ్వట్లేదు. ఆక్సిటోసిన్ వాడడం వల్ల గర్భాశయంలో కాంట్రాక్షన్స్, సెక్స్ లో సమస్యలు, కిడ్నీలు, ప్రొస్టేట్ సమస్యలు ఎదురవుతాయి.

ఆక్సిటోసిన్ వల్ల దుష్ర్పభావాలు:

ఆక్సిటోసిన్ ని తరచు ఉపయోగించడం వల్ల ఆ జంతువులను మనం హింసించినట్లే అవుతుంది. దీనివల్ల కండరాలు సంకోచ, వ్యాకోచాలకు గురవుతాయి. దీని వల్ల చాలా నొప్పి పుడుతుంది. అందుకే 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యానిమల్స్ యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం ఆక్సిటోసిన్ ని వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం రెండూ చట్టరిత్యా నేరంగా పరిగణిస్తారు. ఈ మందు ఎక్కువగా వాడిన ఆవులు, గేదెలు చాలా తక్కువ కాలంలోనే వట్టిపోతాయి. పిల్లలను కనే శక్తిని కోల్పోతాయి. పాలు కూడా ఎక్కువ రోజులు అందించలేవు. ఒకవేళ వచ్చినా పాల నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాదు.. వాటి జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. అంటే దీర్ఘకాలంలో ఇది వాటిని పెంచేవారికి కూడా నష్టాలనే కలిగిస్తుందన్నమాట.

మనుషుల్లోనూ దుష్ర్పభావాలు:

ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన గేదెలు, ఆవులు ఇచ్చిన పాలను తాగడం వల్ల మనుషుల్లోనూ చాలా రకాల చెడు ప్రభావాలు ఎదురవుతాయి. ఇందులో ముఖ్యంగా హార్మోన్ల అసమతౌల్యత ఎదురవ్వడం ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో రజస్వల అయ్యే వయసు చాలా తగ్గిపోతోంది. ఆడపిల్లల్లోనే కాక మగవారిలోనూ గైనకోమాస్టియా (పెద్ద వక్షోజాలు) సమస్య ఇబ్బంది పెడుతోంది. చిన్న పిల్లల్లో కంటి చూపు సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. అంతేకాదు.. తరచూ అలసట ఎదురవుతుంది. గర్భం ధరించిన వారు ఇలాంటి పాలు తాగితే మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బిడ్డ పుట్టిన రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లుల్లో హెమరేజ్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. చిన్న పిల్లల్లో జాండిస్ వచ్చే అవకాశాలు, గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం జరుగుతుంది. అంతేకాదు.. వాంతులు రావడం, కళ్లు తిరగడం, ముక్కులో ఇరిటేషన్, నొప్పి, బ్రెయిన్ సెల్స్ ని తగ్గించి మతిమరుపు సమస్యలు, మరీ ఎక్కువగా తీసుకుంటే హిస్టీరియా కూడా ఎదురవుతుంది. తలనొప్పి, ఒంటి నొప్పులు, ఫిట్స్, ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఆంగ్జైటీ, చాతి నొప్పి వంటివి కూడా ఎదురవుతాయి.

అయితే ఆక్సిటోసిన్ అస్సలు అవసరం లేదా అంటే కాదు.. దీనివల్ల కొన్ని మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అత్యవసరమైతే వీటిని ఉపయోగించవచ్చు. సింథటిక్ మందులుగా దీన్ని ఎప్పుడు ఉపయోగించవచ్చంటే..

1. ప్రసవం సమయంలో,

2. ప్రసవం తర్వాత హై బీపీ ని తగ్గించుకోవడానికి.. డెలివరీ తర్వాత రక్తం బయటకు పోకుండా కాపాడేందుకు..

3. మిస్ క్యారేజ్ తర్వాత గర్భాశయాన్ని శుభ్రం చేసేందుకు గర్భాశయంలో ఏమీ మిగిలిపోకుండా ఉండేందుకు..

4. రొమ్ముల్లో బ్లాకేజ్ ని తొలగించి పాలు రాని సందర్భంలో పాలు వచ్చేలా చేయడం

వంటి సందర్భాల్లో మాత్రమే వైద్యుల సలహా మేరకు ఆక్సిటోసిన్ ని ఉపయోగించడం మంచిది.

https://krishijagran.com/news/is-government-to-regulate-oxytocin/

https://krishijagran.com/news/oxytocin-to-increase-milk-producing-capacity-to-be-banned-by-1st-july-2018/

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More