వ్యవసాయం అనగానే మొదటగా ఆలోచనలోకి వచ్చేది పచ్చని పంట పొలాలు, అయితే వ్యవసాయం అనేది ఒక సమూహారాని తెలియచేసేపదం. పంట సాగుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు అన్నిటిని కలిపి వ్యవసాయం లాగా పరిగణిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడిపరిశ్రమతో సమానమైన స్థానం జీవాల పెంపకానికి ఉంది. పాడి పరిశ్రమతో పోలిస్తే జీవాల పంపకానికి అయ్యే ఖర్చుకూడా తక్కువే. జీవాల పెంపకం కొత్తగా ప్రారంభించాలనుకున్న రైతులు కొన్ని సూచనలు పాటించాలి వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదివరకటి రోజుల్లో జీవాల పెంపకాన్ని కులవృత్తిగా మాత్రమే పరిగణించేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. జీవాల పెంపకంలో దాగున్న లాభాలను అర్ధం చేసుకున్నవారు, జీవాల పెంపకాన్ని ఒక పరిశ్రమగా మార్చి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమను అభివృద్ధి చెయ్యాలని ఎన్నో సబ్సిడీలను, ప్రోత్సహకాలు రైతుల ముందుకు తీసుకువచ్చింది. చిన్న మరోయు మద్యకారు రైతులకు జీవాల పెంపకం ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. తక్కువ ఖర్చుతోనే మంచి లాభాలు పొందేందుకు వీలుంటుంది.
అవసరమైన పెట్టుబడి:
గొర్రెలను లేదా మేకలను వాణిజ్య ప్రమాణాలతో పెంచాలనుకునే రైతులు, వీటికి అవసరమైన షెడ్ ఏర్పాతు చేసుకోవాలి. జీవాల మంద పరిమాణాన్ని బట్టి షెడ్ సైజు మరియు ఖర్చు ముడిపడివుంటయి. సాధారణంగా ఒక 100 గొర్రెలను పెంచడానికి 10 లక్షల వరకు పెట్టుబడి ఉండవచ్చు, ప్రాంతాన్ని బట్టి ఈ పెట్టుబడిలో స్వల్ప మార్పులు కనిపించవచ్చు. రైతులు తమ ఫారంలో జీవాల పెంపకం లేదా బ్రీడింగ్ చేపట్టే అవకాశం ఉంటుంది. జీవాలను పెంచాలనుకుంటే ఆరునెలలు పాటు పెంచి తర్వాత మార్కెట్లో విక్రయించవచ్చు. అదే బ్రీడింగ్ చేసే రైతులు గొర్రెలు లేదా మేక్ పిల్లలను పెంచి వాటిని మిగతా ఫారాలకు ఎగుమతి విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఒక ఏడాదికి జీవాల నుండి మూడు జనరేషన్లు వస్తాయి.
ఎంత స్థలంలో పెంచాలి?
జీవులను పెంచాడనికి అవి తిరగడానికి సరిపడినంత స్థలం కేటాయించాలి, లేదంట రోగాలు ప్రభాలమయ్యే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా వేసవై కాలంలో చిన్న షెడ్లలో జీవులను పెంచడం ద్వారా అవి ఉక్కపోతకు గురయ్యి వడదెబ్బ భారిన పడేందుకు ఆస్కారం ఉంది. జీవులను మేపడానికి పశుగ్రాసాల అవసరం చాల ఎక్కువ, 100 జీవులను పెంచే వారు కనీసం రెండు ఎకరాలలో పశుగ్రాసాల సాగుచేపట్టాలి. వీటితో పాటు ఎండుగడ్డి మరియు దాణా సమయానుసారంగా అందించాలి. పాడి పశువులతో పోలిస్తే జీవుల పెంపకానికి అవసరమయ్యే దాణా కూడా తక్కువే. ధాన్యాలు, తవుడు వంటి వాటితో దాణాను సులభంగా సిద్ధం చేసుకోవచ్చు.
అనువైన రకాలు:
జీవాల పెంపకం ఆరంభంలో, ఎటువంటి రకం జంతువులను ఎంచుకోవాలనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఎంచుకునే రకాలు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగేవి అయ్యుండాలి. గొర్రెల్లో నెల్లూరు రకాలకు మంచి గిరాకీ ఉంటుంది పైగా ఇవి మన వాతావరణ పరిస్థితికి చక్కగా అనుకూలిస్తాయి. నెల్లూరు జోడిపి, నెల్లూరు పళ్ల, మరియు నెల్లూరు బ్రౌన్ వంటివి ముఖ్యమైన రకాలు. అలాగే మేకలలో జామునపురి, బార్బేరి, సిరోహి వంటివి పెంపకానికి అనువుగా అలాగే మంచి దిగుబడిని ఇస్తాయి.
Share your comments