
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి, రైతు ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం (Agriculture Infrastructure Fund – AIF) కొత్త పోకడలకు మార్గం చూపుతోంది. ఈ పథకం కింద ప్రత్యేకంగా వర్టికల్ వ్యవసాయానికి (Vertical Farming) రూ.2 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్టు ప్రకటించింది. అతి తక్కువ స్థలంలో అధిక దిగుబడి పొందే అవకాశం కలిగించే ఈ విధానం నగరాల నుంచి గ్రామాల వరకూ సాగులో కొత్త అవకాశాలను తెరలేపుతోంది.
వర్టికల్ వ్యవసాయం అంటే ఏంటి?
వర్టికల్ వ్యవసాయం అనేది నిలువుగా పొరలుగా పంటలను సాగు చేసే పద్ధతి. ఈ సాగుకు భూమి అవసరం లేదు. మట్టికి బదులుగా నీటి ఆధారిత హైడ్రోపోనిక్స్, చేపల – మొక్కల సంయుక్తంగా పెంచే ఆక్వాపోనిక్స్, వేర్లు గాలిలో ఉండే ఏరోపోనిక్స్ వంటి సాంకేతికతల ఆధారంగా సాగు జరగుతుంది (Modern Farming Methods India 2025). ఇది ముఖ్యంగా పట్టణాల్లో (Urban Farming Opportunities India), భూమి కొరత ఉన్న చోట్ల లేదా ఇండ్లలో చేపట్టే సాగు విధానంగా విస్తరిస్తోంది. పర్యావరణ ప్రభావాలు తక్కువగా ఉండడంతో పాటు, సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
AIF రుణాల ప్రాధాన్యత (AIF Scheme for Innovative Agriculture)
ఈ విధానంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద (Central Government Farming Subsidies) వర్టికల్ ఫార్మింగ్, పాలీహౌస్, టిష్యూ కల్చర్, నర్సరీలు, శీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, డ్రిప్ సిస్టమ్లు, పుట్టగొడుగుల పెంపకం వంటి అనేక అంశాలకు రూ. 2 కోట్ల వరకు రుణాన్ని 3 శాతం వడ్డీతో అందిస్తోంది (Rs 2 Crore Loan Vertical Farming India). ఈ రుణం 7 సంవత్సరాల పాటు చెల్లించదగినది కావడం రైతులకు ఊరట.
ఎవరెవరు అర్హులు?
- రైతులు (Farmers)
- రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs)
- స్వయం సహాయక బృందాలు (SHGs)
- ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు (PACS)
- వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు (APMCs)
- జేఎల్‌జీ గ్రూపులు (JLGs)
అవసరమైన డాక్యుమెంట్లు
- బ్యాంకు లోన్ అప్లికేషన్
- ఫోటోలు
- ఆధార్/పాన్/వోటర్ ఐడి
- గత మూడేళ్ల ఆదాయపన్ను రిటర్న్లు (ఐటీ దాఖలుదారులైతే)
- భూమి యాజమాన్య పత్రాలు
- బ్యాంక్ స్టేట్‌మెంట్
- వివరమైన ప్రాజెక్టు నివేదిక (DPR)
- Title Investigation Report (TIR)
దరఖాస్తు విధానం
ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరగుతుంది. దరఖాస్తుదారులు https://agriinfra.dac.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో ఉన్న బెనిఫిషరీ సెక్షన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2 రోజుల్లో ధృవీకరణ చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ పరిశీలన చేసి 60 రోజుల్లో లోన్ ఆమోదం పూర్తవుతుంది.
దరఖాస్తు విధానంపై వీడియో గైడ్ కూడా అందుబాటులో ఉంది:
https://agriinfra.dac.gov.in/Content/video/Agri_pro_English_6.mp4
లభించే బ్యాంకులు
- కమర్షియల్ బ్యాంకులు
- షెడ్యూల్డ్ కో-ఆపరేటివ్ బ్యాంకులు
- రీజినల్ రూరల్ బ్యాంకులు
- స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
- నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు
- డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు (DCCBs)
భవిష్యత్తు వ్యవసాయానికి వర్టికల్ ఫార్మింగ్ ఒక నవీన దిశ. భూమి తక్కువగా ఉన్నా, ఇంట్లో ఉండి వ్యవసాయం చేయాలన్న కలను నెరవేర్చే మార్గం ఇది (Vertical Farming Benefits for Indian Farmers). కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న AIF రుణ పథకంను రైతులు వినియోగించుకుంటే, వారు తక్కువ పెట్టుబడి, భూమి తో అధిక ఆదాయం (High Yield Low Land Farming Techniques) పొందే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికైనా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.
Share your comments