
మే 20వ తారీఖు, ఈ తేదీ మర్చిపోకండి! అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ జాబితాను మే 20వ తేదీలోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రతి రైతు అర్హతను స్థానిక స్థాయిలో అధికారులు నిర్ధారించి, తగిన ఆధారాల ఆధారంగా జాబితాలో చేర్చనున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ పథకాన్ని మే నెలలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడుకి ముందు అన్ని కమిటీలను పూర్తి చేయాలని సీఎం సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు నియమిస్తామని తెలిపారు. ఈ పథకం కింద రైతుకు మొత్తం రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం కిసాన్’ ద్వారా ఇప్పటికే లభించే రూ.6 వేలు కూడా భాగంగా ఉంటాయి. మిగిలిన రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకు మూడుసార్లుగా నేరుగా జమ చేయనుంది.
రూ.20 వేలు మూడు విడతలుగా – పీఎం కిసాన్‌తో కలిపే విధానం
రాష్ట్రంలోని ప్రతి అర్హ రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘అన్నదాత సుఖీభవ’ పేరిట ప్రారంభించనున్న ఈ పథకంలో సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా లబ్ధి కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ పథకం కింద రైతుకు మొత్తం రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం కిసాన్’ ద్వారా ఇప్పటికే లభించే రూ.6 వేలు కూడా భాగంగా ఉంటాయి. మిగిలిన రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకు మూడుసార్లుగా నేరుగా జమ చేయనుంది.
ఈ పథకం సొంత భూమి ఉన్న రైతులతోపాటు, అటవీ భూములపై హక్కులు ఉన్నవారికి, అలాగే కౌలు రైతులకు కూడా వర్తించనుంది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే ప్రతి అర్హ కుటుంబానికి ఆర్థిక భరోసా లభించనుంది.
రైతుల జాబితా మే 20లోగా అప్‌లోడ్ చేయాలి
ఈ పథకాన్ని అమలు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ జాబితాను మే 20వ తేదీలోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రతి రైతు అర్హతను స్థానిక స్థాయిలో అధికారులు నిర్ధారించి, తగిన ఆధారాల ఆధారంగా జాబితాలో చేర్చనున్నారు.
పథకం ప్రారంభానికి చంద్రబాబు సన్నద్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని మే నెలలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడుకి ముందు అన్ని కమిటీలను పూర్తి చేయాలని సీఎం సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు నియమిస్తామని తెలిపారు.
ప్రజల్లోకి సంక్షేమ ఫలితాలు తీసుకెళ్లాలి
జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, సీఎం చంద్రబాబు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. వైఎస్సార్సీపీ చేసిన విమర్శలకు తగిన రీతిలో తిప్పికొట్టాలంటూ సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవడం సంతోషకరమైన విషయమని, వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అమరావతి బలమైన పునాదిగా మారుతుందని చంద్రబాబు తెలిపారు. యువతకు ఉద్యోగాలు, పారిశ్రామికవతరణకు అవకాశాలు కల్పించడానికి అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుందని పేర్కొన్నారు.
పోలవరం – 2027 నాటికి పూర్తి లక్ష్యం
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాక, విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,400 కోట్లు, MSME పార్కులు, లేపాక్షి-కొప్పర్తి కారిడార్ వంటి పలు మౌలిక ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం నిబద్ధత చూపుతోందని వివరించారు.
రైతులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ‘అన్నదాత సుఖీభవ’ కీలక పాత్ర పోషించనుంది. రైతులు తమ అర్హతను నిర్ధారించుకొని సంబంధిత అధికారులను సంప్రదించి లబ్ధి పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
Read More:
Share your comments