Government Schemes

ఇవి ప్రతీ రైతుకి తెలియలిసిన పథకాలు! ఎండాకాలం తస్మాత్ జాగ్రత్త...

Sandilya Sharma
Sandilya Sharma

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. కాసేపు ఎండ, కాసేపు వాన, మరికాసేపు వాడిగాల్పులు. మరి ఇలాంటి సమయంలో, పంట నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ప్రభుత్వం వాతావరణ మార్పుల వల్ల జరిగే నష్టాన్ని పూరించేటందుకు అనేక పథకాలను అందుబాటులో ఉంచింది. అవే ఇవి….   

  • ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)
  • వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (RWBCIS)
  • పెర్ డ్రాప్- మోర్ క్రాప్ (PDMC) 

తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (RWBCIS) సహాయం అందిస్తోంది.

 PMFBY & RWBCIS బీమా ప్రధాన లక్షణాలు

 రైతులకు పంట నష్టాన్ని భర్తీ చేసే సంపూర్ణ బీమా కవరేజ్.

 స్థలాన్ని బట్టి (Area Approach) బీమా పరిధిని నిర్ణయించడం.

 21 రోజుల్లోపు బీమా క్లెయిమ్ చెల్లింపు.

బీమా కంపెనీలు సబ్సిడీ డిమాండ్ చేసినా లేదా, క్లెయిమ్‌లు ఆలస్యం అయితే స్వయంచాలకంగా జరిమానా విధింపు.

నీటి వినియోగ సమర్థత – 'Per Drop More Crop' పథకం

వర్షాధార వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు Per Drop More Crop (PDMC) పథకం అమలు అవుతోంది.

పథకంలో ముఖ్యమైన అంశాలు

  • డ్రిప్ & స్ప్రింక్లర్ ఎరిగేషన్ ద్వారా నీటి ఆదా.
  • చిన్న రైతులకు మద్దతుగా అధునాతన నీటిపారుదల విధానాలను అందుబాటులోకి తేవడం.
  • వర్షాధార వ్యవసాయ భూములను అభివృద్ధి చేయడం.

ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నష్టాలను తగ్గించే పథకాలను ప్రవేశపెట్టి, రైతులకు మద్దతుగా ముందుకు సాగుతోంది.

ఇవే కాకుండా పంటల నష్టాన్ని తగ్గించేందుకు, నీటి సంరక్షణ ప్రణాళికలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సంస్కరణలు, మైక్రో ఎరిగేషన్, క్లైమేట్ రెసిలియంట్ విలేజ్ (CRVs) వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది.

వైపరీత్యాల సమయంలో సహాయం – SDRF, NDRF నిధుల వినియోగం

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.సహాయ చర్యల కోసం State Disaster Response Fund (SDRF) ద్వారా నిధులను రాష్ట్రాలకు కేటాయించనుంది.
ప్రత్యేక ప్రకృతి వైపరీత్యాల (Severe Disaster) స్థితిలో నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) ద్వారా అదనపు ఆర్థిక సహాయం అందించనుంది.
ఇంటర్‌ మినిస్టీరియల్‌ కేంద్ర బృందం (Inter-Ministerial Central Team) IMCT సహాయ నిర్ధారణకు రాష్ట్రాలను సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ – Rainfed Area Development (RAD)

వాతావరణ మార్పులకు తగ్గట్టుగా వ్యవసాయాన్ని, ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ వ్యవస్థ (IFS)గా అభివృద్ధి చేస్తూ వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం (RAD) ద్వారా పలు చర్యలు చేపడుతోంది.

ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ వ్యవస్థ ప్రాధాన్యత
వ్యవసాయాన్ని పశుపోషణ, పండ్ల తోటలు, కృషి అటవీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగ పెంపకం వంటి ఇతర వ్యవస్థలతో అనుసంధానం.
దుర్భిక్ష, వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయక మార్గాలు అందించనుంది.
రైతుల పొలాలలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునే విధంగా మార్పులు.

పర్యావరణ అనుకూల వ్యవసాయానికి మద్దతు – 'National Action Plan on Climate Change (NAPCC)'

2008లో ప్రారంభించిన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (NAPCC) వ్యవసాయ రంగంలో వాతావరణ అనువైన వ్యవసాయ విధానాల అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది.నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (NMSA) ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) – వాతావరణ అనుకూల వ్యవసాయ పరిశోధనలు

భారత వ్యవసాయ పరిశోధనా మండలి National Innovations in Climate Resilient Agriculture (NICRA) అనే ప్రాజెక్టును ప్రారంభించింది.

NICRA ప్రాజెక్టు ముఖ్య లక్షణాలు
వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయడం.
పంటలు, పశువులు, మత్స్య పరిశ్రమ, తోటల సాగుపై వాతావరణ ప్రభావాలను అధ్యయనం చేయడం.
దుర్భిక్ష, వరదలు, వడగాల్పులు, తీవ్ర చలి, ప్రతిఘటన కలిగిన పంట వంగడాలను అభివృద్ధి చేయడం.

అత్యవసర పరిస్థితుల కోసం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కంటిన్జెన్సీ ప్లాన్స్ (DACPs)

భారత దేశంలో వాతావరణ మార్పులకు అత్యంత ప్రభావితమైన 310 జిల్లాలలో 109 జిల్లా 'అత్యధిక ప్రమాద స్థాయిలో', 201 జిల్లాలు 'అధిక ప్రమాద స్థాయిలో' ఉన్నట్లు గుర్తింపు.
651 వ్యవసాయ ప్రధానమైన జిల్లాల కోసం కంటిన్జెన్సీ ప్రణాళికలు రూపొందించబడినాయి.

వాతావరణ మార్పుల ప్రభావాలను తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మళ్లీ ఆధునికతవైపు తీసుకెళ్తోంది. SDRF, NDRF నిధులు, PMFBY బీమా, NICRA ఆధ్వర్యంలో వాతావరణ అనుకూల పంటల అభివృద్ధి, నీటి వినియోగ సామర్థ్య పెంపు, ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ విధానాలు ద్వారా రైతులకు సంరక్షణ కల్పిస్తోంది.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More