
సేంద్రియ వ్యవసాయం (Organic Farming) ప్రకృతి సిద్దమైన వ్యవసాయ విధానం. భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే ఒక అద్భుతమైన మార్గం. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరంపరాగత కృషి వికాస్ యోజన (PKVY), ద్వారా రైతులకు సాగు నుంచి అమ్మకం వరకు పూర్తి మద్దతును అందిస్తోంది.
రైతులకు లభించే ప్రయోజనాలు
PKVY పథకం కింద రైతులకు మొత్తం రూ. 31,500/హెక్టారు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
- రూ. 15,000/హెక్టారు – ఆన్-ఫామ్, ఆఫ్-ఫామ్ సేంద్రియ ఉత్పత్తుల కోసం DBT ద్వారా నేరుగా రైతులకు.
- రూ. 4,500/హెక్టారు – మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, విలువ జోడింపు.
- రూ. 3,000/హెక్టారు – సేంద్రియ ధృవీకరణ (Certification), అవశేష విశ్లేషణ (Residue Analysis).
- రూ. 9,000/హెక్టారు – శిక్షణ, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు.
- గరిష్టంగా 2 హెక్టార్ల వరకూ ఈ మద్దతును పొందవచ్చు.
సేంద్రియ వ్యవసాయం ప్రమాణాల కోసం రెండు రకాల ధృవీకరణ విధానాలు
ఎగుమతి మార్కెట్ కోసం NPOP ధృవీకరణ
వ్యాపార ప్రమాణిత సంస్థ (Third Party Certification) ద్వారా ధృవీకరణవాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహణ
దేశీయ మార్కెట్ కోసం PGS-India ధృవీకరణ
రైతులు, ఉత్పత్తిదారుల స్వయంగా ధృవీకరించుకునే పద్ధతి
వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహణ
సేంద్రియ వ్యవసాయ లక్ష్యాలు
- భూమి సారాన్ని పెంచడం
- నైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్ వంటి ఖనిజ లభ్యతను పెంచడం
- సహజ వనరులను కాపాడుతూ, బయటి ఎరువులపై రైతుల ఆధారాన్ని తగ్గించడం
- రసాయనాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించడం
- కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ రక్షణ
సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం మద్దతు
2015-16 నుండి 59.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోకి మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ మార్పులో కీలకంగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సేంద్రియ వ్యవసాయ విస్తీర్ణం
ఆంధ్రప్రదేశ్ – NPOP కింద 63,678.69 హెక్టార్లు, PGS-PKVY కింద 3,60,805 హెక్టార్లు
తెలంగాణ – NPOP కింద 84,865.16 హెక్టార్లు, PGS-PKVY కింద 8,100 హెక్టార్లు
సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు
సేంద్రియ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ సృష్టించేందుకు సెమినార్లు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు
బయర్-సెల్లర్ మీటింగులు, ప్రదర్శనలు, వ్యాపార ప్రదర్శన మేళాలు, ఇతర రాష్ట్రాల్లో సేంద్రియ ఉత్పత్తుల ప్రోత్సాహక కార్యక్రమాలు, ఇలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
సేంద్రియ వ్యవసాయం రైతులకు పర్యావరణ హితంగా, ఆర్థికంగా లాభదాయకంగా మారుతోంది. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.
Share your comments